Site icon NTV Telugu

TSPSC Group 4 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 9,168 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Tspsc

Tspsc

TSPSC Group 4 Notification: వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు శుభవార్త చెబుతూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో జంబో నోటిఫికేషన్‌ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)… టీఎస్‌పీఎస్సీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లలో ఇదే అతిపెద్ద నోటిఫికేషన్‌ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. గ్రూప్-4 నోటిఫికేషన్‌ను ఇవాళ అధికారికంగా విడుదలైంది.. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అందులో అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, పౌర సరఫరాలశాఖలో 72, ఆర్ధికశాఖలో 255, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్‌లో 2,701 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077, ఎస్సీ వెల్ఫేర్‌లో 474 పోస్టులు, లేబర్ డిపార్ట్‌మెంట్‌లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్‌లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 97 పోస్టులు భర్తీచేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది టీఎస్పీఎస్సీ . వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఎక్కడ చూసినా.. కోచింగ్‌ సెంటర్లు కలకల లాడుతున్నాయి.. ఈ నోటిఫికేషన్‌తో మరింత సందడి ఏర్పడే అవకాశం ఉంది..

Read Also: Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో 16,940 పోస్టులకు నోటిఫికేషన్లు రెడీ..!

Exit mobile version