NTV Telugu Site icon

Study Abroad: ‘విదేశీ విద్య’ అంటే ఇండియాలో మేమే: Uni2Go కోఫౌండర్‌ రితికారెడ్డి

Uni2go

Uni2go

Study Abroad: ‘విదేశీ విద్య’కు ఇండియాలో తామే మారుపేరుగా నిలవాలనుకుంటున్నామని యూని2గో(Uni2Go) అనే స్టార్టప్‌ కోఫౌండర్లలో ఒకరైన రితికా రెడ్డి అన్నారు. తన తండ్రి గత 21 ఏళ్ల నుంచి స్టడీ అబ్రాడ్‌ కౌన్సిలర్‌గా చేస్తున్నారని, ఫారన్‌ ఎడ్యుకేషన్‌ కోసం చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గరకు వస్తుండేవారని చెప్పారు. ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ గురించి వాళ్లలో ఎన్నో సందేహాలు ఉండేవని, తన తండ్రిని అడిగి నివృత్తి చేసుకునేవారని తెలిపారు. దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ స్టార్టప్‌కి రూపకల్పన చేశామని వెల్లడించారు.

స్టడీ అబ్రాడ్‌లోని యూనివర్సిటీలు, కోర్సులు, ఫీజుల సెర్చ్‌ ప్రాసెస్‌ని, స్టూడెంట్‌ రిక్రూట్‌మెంట్‌ని తాము చాలా సింప్లిఫై చేశామని, డిజిటల్‌ బాట పట్టించామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని మరియు ఒకే దేశంలోని పలు యూనివర్సిటీల ఎలిజిబిలిటీ వివరాలు తదితర అన్ని వివరాలను ఫిల్టర్స్‌ ద్వారా ఈజీగా ఫైన్‌డౌట్‌ చేయొచ్చని చెప్పారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, యూఎస్‌ఏ, యూకే, ఐర్‌ల్యాండ్‌ల్లో చదువుకోవాలనుకునేవారు ‘ఎన్-బిజినెస్‌’తో రితికా రెడ్డి చేసిన ‘టెక్‌ టాక్‌’ను వింటే సరిపోతుంది. ఆ వీడియో ఈ కిందే ఉందని గమనించగలరు.