పోస్టల్ శాఖలో ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. పోస్టల్ లో 1,899 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. పోస్టుల వివరాలు, అర్హతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం 1,899 పోస్టులు..
ఇండియా పోస్ట్స్.. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 1,899 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో పోస్టల్ అసిస్టెంట్ – 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ – 143 పోస్టులు, పోస్ట్ మ్యాన్ – 585 పోస్టులు, మెయిల్ గార్డ్ – 3 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 570 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 61 పోస్టులు, తెలంగాణలో 59 పోస్టులు ఉన్నాయి..
అర్హతలు..
పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్:బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించాలి. అదే విధంగా.. ఆయా సర్కిల్స్ లేదా డివిజన్స్‌కు సంబంధించిన స్థానిక భాషను పదో తరగతిలో ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి. దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అదే విధంగా పోస్ట్ మ్యాన్ పోస్ట్‌ల అభ్యర్థులు ద్విచక్ర వాహన లైసెన్స్ కలిగుండాలి. ఈ విషయంలో వికలాంగ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. స్థానిక భాషను పదో తరగతి స్థాయిలో చదవని అభ్యర్థులు.. నియామక ప్రక్రియలో పోస్టల్ శాఖ నిర్వహించే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి..
వయోపరిమితి..
డిసెంబర్ 12 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది..
జీతం..
పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్స్‌కు లెవల్-4లో రూ.25,500-రూ.81,100; పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్‌కు లెవల్-3లో రూ.21,700-రూ.69,100; మల్టీ టాస్కింగ్ స్టాప్‌కు లెవల్-1లో రూ.18,000-రూ.56,900తో ప్రారంభ వేతన శ్రేణి ఉంటుంది..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 9, 2023
దరఖాస్తు సవరణ అవకాశం: డిసెంబర్ 10 – 14 తేదీల్లో
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dopsportsrecruitment.cept.gov.in/Notifications/English.pdf, https://dopsportsrecruitment.cept.gov.in/ ఏదైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ను పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోవచ్చు..