నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లోని పలు ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 60 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం మంచిది..
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల వివరాలు.. 60
డిప్యూటీ మేనేజర్ పోస్టులు
అర్హతలు..
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి..
వయస్సు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది..
జీతం..
నెలకు రూ.15,600 నుంచి రూ.39,100.
ఎంపిక ప్రక్రియ..
యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.
వెబ్‌సైట్: https://nhai.gov.in/
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవాలి..