IOCL Recruitment 2023: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1720 ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. పలు విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపికైన వారు మధుర, పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్, గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా.. రిఫైనరీల్లో పనిచేయవల్సి ఉంటుంది..
వయస్సు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా అక్టోబర్ 31, 2023వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది..
అర్హతలు..
ట్రేడ్ పోస్టులకు.. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, మెకానికల్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలున్నాయి..
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో నవంబర్ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 21, 2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 20, 2023
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీలు: నవంబర్ 2, 2023 నుంచి 27 వరకు
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 3, 2023
రాత పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: డిసెంబర్ 8, 2023
సర్టిఫికెట్ వెరిఫికేషన్ :డిసెంబర్ 13 నుంచి 21
ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే అధికార వెబ్ సైట్ ను బాగా పరిశీలించి అప్లై చెయ్యగలరు..
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!