కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం 91 ఖాళీలకు రిక్రూట్‌మెంట్ చేపడుతుంది.. ఇందులో జూనియర్ కన్సల్టెంట్ 62 పోస్టులు, యంగ్ ప్రొఫెషనల్ 26 పోస్టులు, సీనియర్ కన్సల్టెంట్ 3 పోస్టులు భర్తీ కానున్నాయి.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు అధికారిక పోర్టల్ sfio.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ గడువు నంబర్ 5న ముగుస్తుంది… ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెషనల్, కన్సల్టెంట్ వంటి పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..
అర్హతలు :
ఒక్కో పోస్ట్ కు ఒక్కో అర్హతలు కలిగి ఉండాలి..యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు అప్లై చేసుకొనే వాళ్లు..గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కార్పొరేట్ లా రంగంలోని ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, రెగ్యులేటరీ సంస్థలపై అనుభవం ఉండాలి..
జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు..సీఏ, సీడబ్ల్యూఏ, ఎంబీఏ(ఫైనాన్స్) చదివిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు నుంచి ఎనిమిదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ఫోరెన్సిక్ ఆడిట్/ఫైనాన్షియల్ అనాలిసిస్ రంగంలోని ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, రెగ్యులేటరీ బాడీలపై అవగాహన ఉండాలి.. ఇలా ఒక్కో పోస్ట్ కు ఒక్కో అర్హతలను కలిగి ఉండాలి..
వేతనం..
యంగ్ ప్రొఫెషనల్ (లా), యంగ్ ప్రొఫెషనల్ (ఎఫ్‌ఏ) పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 60,000 లభిస్తుంది. జూనియర్ కన్సల్టెంట్ (లా), జూనియర్ కన్సల్టెంట్(ఎఫ్‌ఏ) పోస్టులకు జీతం రూ.80,000 నుంచి రూ.1,45,000 మధ్య ఉంటుంది. సీనియర్ కన్సల్టెంట్ (FA) పోస్ట్‌కు జీతం రూ.1,45,000 నుంచి రూ. 2,65,000 మధ్య ఉంటుంది..
ఎలా అప్లై చెయ్యాలంటే?
SFIO అధికారిక పోర్టల్ sfio.gov.inను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ‘వాట్స్ న్యూ’ కాలమ్‌లోని ‘ఎస్‌ఎఫ్‌ఐఓ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్-2023’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి. ఆ తరువాత ‘అప్లై హియర్’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.అవసరమైన డిటైల్స్ అప్లై చేసి, ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.. అప్లై చేసుకొనే ముందు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవాలి..