NTV Telugu Site icon

First Water School in Hyderabad: హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి వాటర్‌ స్కూల్‌

First Water School In Hyderabad1

First Water School In Hyderabad1

First Water School in Hyderabad: జలక్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వాటర్‌ స్కూల్‌ని హైదరాబాద్‌లో నిన్న ప్రారంభించింది. ఈ ఎక్స్‌క్లూజివ్‌ స్కూల్‌ని మాదాపూర్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌, మునిసిపల్‌ వ్యవహారాలు-పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆరంభించారు. సెయిలింగ్‌, కయాకింగ్‌, విండ్‌ సర్ఫింగ్‌, స్టాండప్‌ ప్యాడ్లింగ్‌తోపాటు ఇతర జల అనుబంధ క్రీడలను ఇక్కడ నేర్పిస్తారు. ఈ వాటర్‌ స్కూల్‌ని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెఎండీఏ), గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ).. యాచ్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా ఏర్పాటుచేశాయి. ప్రస్తుతానికి ఇక్కడ పేద పిల్లలకు శిక్షణ ఇస్తారు. రెండు వారాల తర్వాత అందరికీ అవకాశం కల్పిస్తారు.

ఈ నేపథ్యంలో ఆసక్తి కలిగినవాళ్లు పేర్లు నమోదుచేసుకొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అర్వింద్‌ కుమార్‌ సూచించారు. యాచ్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కి ఈ రంగంలో 14 ఏళ్ల విశేష అనుభవం ఉందని, ఈ సుదీర్ఘకాలంలో 100 మందికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసిందని చెప్పారు. ‘దుర్గం చెరువులోని స్వచ్ఛమైన నీళ్ల తల్లి ఒడిలో ఓనమాలతో మొదలుపెట్టి జల క్రీడల్లో ఆసియా, ఒలింపిక్‌ స్థాయి ఛాంపియన్లుగా ఎదగాలి. స్థానికంగా పుట్టిపెరిగి రాష్ట్ర, జాతీయ స్థాయి విజేతలుగా నిలిచినవాళ్ల మార్గదర్శకత్వంలో ఈ స్కూల్‌ అన్ని జలక్రీడలకు ఒక హబ్‌(ముఖ్య కేంద్రం)గా సేవలందించాలి’ అని అర్వింద్‌ కుమార్‌ ఆకాంక్షించారు. ఈ వాటర్‌ స్కూల్‌లో అత్యాధునిక క్రీడా పరికరాలు ఉన్నాయి. అంతర్జాతీయ/ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల్లో సత్తా చాటిన నిపుణులు ట్రైనింగ్‌ ఇస్తారు.

Work From Office: ఆఫీసుకు వెళుతున్నాం కదా! ఇంకా ఆ పాత బట్టలేనా? కొనేద్దాం కొత్తవి!!

వాటర్‌ స్పోర్ట్స్‌ను సీరియస్‌గా తీసుకునేవారితోపాటు వినోద క్రీడగా భావించేవారికి కూడా విడివిడిగా శిక్షణ తరగతులను ఏర్పాటుచేయనున్నారు. నర్సరీ నుంచి నేషనల్‌, ఏసియన్‌, ఒలింపిక్స్‌ స్థాయి వరకు శిక్షణ అందిస్తారు. తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ వాటర్‌ స్కూల్‌కి ఔత్సాహికుల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యూత్‌.. సెయిలింగ్‌, విండ్‌సర్ఫింగ్‌ క్రీడల పట్ల ఆసక్తి చూపుతారని, సీనియర్లు.. కయాకింగ్‌, స్టాండప్‌ ప్యాడ్లింగ్‌లపై ఇంట్రస్ట్‌ ప్రదర్శిస్తారని పేర్కొంటున్నారు. ఆఫ్‌బీట్‌ స్పోర్ట్‌ అయిన సెయిలింగ్‌ విషయంలో హైదరాబాద్‌ లోకల్‌ స్టూడెంట్స్‌ బాగా ఆకర్షితులవుతారని, విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్న విద్యార్థులు ఈ వాటర్‌ స్పోర్ట్స్‌ నేర్చుకోవటం ద్వారా ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌కి మార్గాన్ని సుగమం చేసుకుంటారని తెలిపారు.

రెజ్యూమ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రస్తావన ఉంటే అది వాళ్లకు బాగా పనికొస్తుందని, ఫారన్‌కి వెళ్లాక ఈ క్రీడల్లో యూనివర్సిటీ స్థాయిలో నైపుణ్యం సంపాదిస్తారని చెప్పారు. పెద్దవాళ్లు ‘ఒలింపిక్స్‌ క్లాస్‌ లేజర్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ 420 బోట్స్‌’ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణించగలుగుతారని వివరించారు. ఈ వాటర్‌ స్కూల్‌లో వాటర్‌-బేస్డ్‌ కార్పొరేట్‌ లీడర్‌షిప్‌, టీమ్‌ బిల్డింగ్‌, బాండింగ్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో గతంలో బాగా ప్రజాదరణ పొందిన కయాకథాన్‌, హైడ్రథాన్‌ ఈవెంట్స్‌ కోసమూ ప్లాన్‌ చేస్తోంది. లైఫ్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ సైతం ఇక్కడ రానున్న రోజుల్లో అందుబాటులోకి రానుంది.

Show comments