NTV Telugu Site icon

CBSE Notification: సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

Untitled 5

Untitled 5

New Delhi: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023వ సంవత్సరం సెప్టెంబర్ 19 నుండి 2023వ సంవత్సరం అక్టోబర్ 18 వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు ఎలాంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ లేదా డాక్యుమెంట్‌ల హార్డ్ కాపీని వెసులుబాటును కల్పించదు. బోర్డు ప్రకారం ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులకు మాత్రమే స్కాలర్‌షిప్‌ అందించబడుతుంది. స్కాలర్‌షిప్‌ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే విద్యార్థిని CBSE అనుబంధ పాఠశాలల్లో చదువుతుండాలి. మరియు మొదటి ఐదు సబ్జెక్టులలో 60 శాతం మార్కులతో 10 వ తరగతి అర్హత కలిగి ఉన్న విద్యార్థినిలు భారతీయ జాతీయత కలిగిన ఒంటరి ఆడపిల్లల గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Read also:The National Testing Agency (NTA): విడుదలైన 2024 NEET, JEE మెయిన్ పరీక్ష తేదీలు..

తప్పనిసరిగా అభ్యర్థి CBSE అనుబంధ పాఠశాలల్లో 11 మరియు 12 తరగతులలో విద్యను అభ్యసిస్తూ ఉండాలి. విద్యార్థి యొక్క నెలవారీ ట్యూషన్ ఫీజు 10వ తరగతిలో రూ/ 1,500 కంటే ఎక్కువ ఉండకూడదు మరియు 11 మరియు 12వ తరగతిలో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదల ఉండకూడదు. అయినా విద్యార్థులు నెలకు రూ/ 6,000 కంటే ఎక్కువ ట్యూషన్ ఫీజు కోసం అర్హులు కాదు. గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తు ఫారమ్‌లను ద్రువీకరించాల్సిందిగా బోర్డు అనుబంధ పాఠశాలలను కోరింది. 2023 సెప్టెంబర్ 25, నుండి 2023 అక్టోబర్ 25 వరకు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత బోర్డు స్కాలర్‌షిప్‌ను మరింత పరిశీలించి పునరుద్ధరిస్తుంది. 11 వ తరగతిలో 50 శాతం ఎక్కువ ఉతీర్ణత సాధించి 12వ తరగతికి పదోన్నతి పొందిన తర్వాత మాత్రమే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించడం కొనసాగుతుంది.