NTV Telugu Site icon

Big Breaking : తెలంగాణాలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు..

Schools

Schools

బాబోయ్ వర్షాలు.. ఎన్నడూ చూడని విధంగా దంచికొడుతున్నాయి.. ఎటు చూసిన రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి.. తెలంగాణలో వర్షాలు గత కొద్దిరోజులుగా దుమ్ముదులిపి దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలూ పడ్డాయి. అయితే.. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో.. పాఠశాలలకు సెలవుల విషయంలో తెగ చర్చలు జరిగాయి..

కేసీఆర్ సర్కార్ పాఠశాలలకు సెలవులు ఇస్తుందా లేదా? అని తల్లిదండ్రులలో ఆందోళన మొదలైంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సర్కార్ కీలక ప్రకటన చేసింది.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజుల పాటు (మంగళ, బుధ, గురువారం) సెలవులు ప్రకటించే దిశగా సర్కారు ఆలోచన చేస్తున్నట్టు అనుకున్నా.. ఇప్పుడు రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రేపు ఎల్లుండి ( బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో అధికారులు ముందస్తుగా సెలవులు ప్రకటించినట్లు తెలుస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..