Kurnool Crime: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు బండ రాయితో తలపై కొట్టి చంపారు. కర్నూలు నుంచి బైక్ పై సొంతూరు మీదివేములకు వెళ్తుండగా కాపుకాచి హత్య చేశారు. హత్యకు రాజకీయపరమైన కారణాల, వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ హత్య స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. మీదివేములలో శాంతి, భద్రతలను ఎస్పీ సమీక్షించారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ. వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడును చంపింది టీడీపీ నాయకులేనని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని. వైసీపీ కి గ్రామంలో పట్టున్నందుకు సహించలేక హత్య చేశారన్నారాయన.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైసీపీ వాళ్ళను హత్య చేయడమేనా అని ప్రశ్నించారు కాటసాని. కాగా, రమేష్ నాయుడు 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందాడు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు. రమేష్ నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also: Elon Musk: సెక్స్ స్కామ్ నిందితుడితో ట్రంప్‌కు సంబంధాలు.. మస్క్ సంచలన ఆరోపణలు
