Khammam Murder Case: ఖమ్మం జిల్లా కామేపల్లి మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలను వెలుగులోకి వచ్చాయి. మర్డర్ చేయడం.. ఆ తర్వాత ఆనవాళ్లను చెరిపేయడం.. డెడ్ బాడీని మాయం చేయడం లాంటి వాటిని నిందితులు యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ కంత్రీలు ఎవరు? ఎందుకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చంపారు? కేవలం బంగారం కోసమే హత్య చేశారా?
READ ALSO: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు.. ఏఐ వీడియోలు ఉపయోగించొద్దని వార్నింగ్
ఖమ్మం జిల్లా కామేపల్లిలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సెప్టెంబర్ 22న అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఐతే ఈ మిస్సింగ్ కేసు తర్వాత ఖమ్మం రూరల్ పరిధిలో పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన తల, చేతులు లభించాయి. వాటిని కుటుంబ సభ్యులకు చూపించి.. వెంకటేశ్వర్లు శరీర భాగాలుగా గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా.. మర్టర్ కేసుగా మారింది…
3 తులాల బంగారం కోసం హత్య
ఇక ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడు అశోక్‌ను గుర్తించారు. పలు సాంకేతిక ఆధారాలతో ఓ నిర్ధారణకు వచ్చారు. నిజానికి వెంకటేశ్వర్లు, అశోక్ ఇద్దరూ స్వలింగ సంపర్కులు. ఈ విషయం కోసమే అశోక్ రూమ్‌కు వెంకటేశ్వర్లు వెళ్లినట్లు ధృవీకరించుకున్నారు పోలీసులు. ఐతే ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నగ్మాతో కలిసి వెంకటేశ్వర్లును అశోక్ హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కేవలం 3 తులాల బంగారం కోసం హత్య జరిగిందంటున్నారు…
అశోక్ ఇచ్చిన బంగారు గొలుసును విక్రయించిన నగ్మా
వెంకటేశ్వర్లు హత్యలో నగ్మా పూర్తి పాత్ర ఉందంటున్నారు పోలీసులు. హత్య చేసే సమయంలో ఆమె కూడా రూంలోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఎవరూ రాకుండా చూస్తూ.. అశోక్ ఇచ్చిన బంగారు గొలుసును కూడా నగ్మానే విక్రయించిందని చెబుతున్నారు… ఇక ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు సంబంధించి శబ్దం రాకుండా ఎలా చంపాలో యూట్యూబ్‌లో వెతికి హత్య చేశారు. వెంకటేశ్వర్లు శరీర భాగాలను వేరు చేసేందుకు యూట్యూబ్‌లో చూసి కత్తులు కొనుగోలు చేశారు. శరీర భాగాలను అత్యంత కిరాతకంగా వేరు చేసి శరీర భాగాలను వేరు వేరు ప్రాంతాలలో పారేశారు. వెంకటేశ్వర్లు హత్య కేసులో అశోక్‌తో పాటు నగ్మాపైనా కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.. మరోవైపు వెంకటేశ్వర్లు మొండెం ఎక్కడ పడేశారనేది మిస్టరీగానే ఉంది. దీంతో పోలీసుల తీరును కుటుంబ సభ్యులు తప్పు పడుతున్నారు. వారు కేసును సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు..
READ ALSO: Netanyahu Trump AI Photo: ఏఐ మ్యానియా.. ట్రంప్‌కు నెతన్యాహు నోబెల్ ప్రదానం..
