NTV Telugu Site icon

MP Video: యువతిపై ఉన్మాది ఘాతుకం.. మోసం చేసిందంటూ కత్తితో లెక్చరర్ దాడి

Mpattack

Mpattack

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై యువతిని ఏడు సార్లు కత్తితో పొడిచాడు. రక్తమోడుతూ విలవిలలాడుతుంటే.. మొబైల్‌లో షూట్ చేస్తున్నారే తప్ప.. ఎవరు ముందుకొచ్చి రక్షించిన పాపాన పోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Lavanya vs Sekhar Basha: శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య?

23 ఏళ్ల కుల్దీప్ వర్మ.. జ్ఞానోదయ మహావిద్యాలయంలోని ఎన్‌ఎస్‌యూఐ కళాశాల అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల యువజన కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గంలో చేరాడు. అయితే యువతి తనను మోసం చేసిందంటూ నడిరోడ్డుపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తనను మోసం చేసిందంటూ కేకలు వేశాడు. చుట్టూ జనం ఉన్నా.. రక్షించిన పాపాన పోలేదు. మొబైల్‌లో షూట్ చేస్తూ ప్రేక్షకుల్లా చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Wayanad Landslide: వయనాడ్‌ ఘటనలో 297కి చేరిన మృతుల సంఖ్య.. 450 వరకు ఇళ్లు, భవనాలు ధ్వంసం

Show comments