Site icon NTV Telugu

Young man raped buffalo: గేదెను కూడా వదలని కామాంధుడు.. ఇలా దొరికిపోయాడు..!

Buffalo

Buffalo

చిన్నా పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా తరచూ మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇంట్లో కొందరిపై, ఉద్యోగం చేసే దగ్గర మరికొందరిపై.. చదువుకోవడానికి వెళ్లిన చోట మరికొందరిపై.. ప్రయాణాలు చేస్తుండగా అడ్డుకుని ఇంకాకొద్దరిపై ఇలా.. ఎక్కడబడితే అక్కడ అనే తరహాలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. చివరకు జంతువులను కూడా వదలడం లేదు కామాంధులు.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో ఓ యువకుడు గేదెపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.. గేదెపై ఆ యువకుడు అత్యాచారం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. అది కాస్తా సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చగా మారిపోయింది.. వీడియో వైరల్ కావడంతో, పోలీసు స్టేషన్‌లో యువకుడిపై ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

Read Also: Vikranth Rona: సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘రారా రక్కమ్మ’ వీడియో సాంగ్ రిలీజ్

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఉదయపూర్‌లోని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్‌వాస్‌లో ఓ యువకుడు గేదెతో అసహజ శృంగారం చేశారు.. ఇది కాస్తా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.. ఆదివారం ఓ యువకుడు గేదెతో అసహజ చర్యకు పాల్పడ్డాడని జంతు ప్రేమికుడైన చిరాగ్ అనే యువకుడి అధికారులకు ఫిర్యాదు చేశాడు.. జంతు హింస నివారణ అధికారి దీనదయాళ్ గోరాకు సమాచారం చేరవేశారు.. దీంతో, ఆయన ఈ ఘటనపై తమకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. ఆయన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశాం.. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే నమోదు చేసే 1960లోని ఐపీసీ సెక్షన్ 11(1)(ఎ) సెక్షన్ 377, 511 కింద యువకుడిపై కేసు నమోదు చేశామని.. ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.. కాగా, గతంలోనూ రాజస్థాన్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. భరత్‌పూర్‌లో ఓ వృద్ధుడు ఆడ వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసును నిర్ధారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు..

Exit mobile version