డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. అందులో చదువుకున్నవారు కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ఉన్నత చదువు చదువుకొని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడు తక్కువకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారి తొక్కి జైలుపాలయ్యిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. విజయవాడ ఫకీరుగూడెం కు చెందిన సోహైల్(21) అనే యువకుడు కష్టపడి చదువుకొని సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆశించినంత డబ్బు రాకపోవడంతో అడ్డదారి పట్టాడు. కొన్నిరోజుల క్రితం ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్న సోహైల్.. నీలి చిత్రాలకు బానిసగా మారాడు. ఆలా చూస్తున్నప్పుడే పోర్న్ వీడియోలు అమ్మబడును అనే ప్రకటన చూశాడు. దాని వలన ఎక్కువ ఆదాయం వస్తుందని తెలుసుకొని ఆన్లైన్ ద్వారా డబ్బు కట్టి పోర్న్ వీడియోలను కొనుక్కున్నాడు.
వారు పంపించిన ఒక లింక్ ఓపెన్ చేసి చూడగా సుమారు 4000 వేల చైల్డ్ పోర్న్ వీడియోలు ప్రత్యేక్షమయ్యాయి. వీటిని ఒక ఆన్ లైన్ సైట్ గా క్రియేట్ చేసి తక్కువ ధరకు నీలి చిత్రాలు అమ్మబడును అని ప్రకటించాడు. ఈ విషయాన్ని గమనించిన ఒక వ్యక్తి సోహైల్ పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిపై 34/ 2021 అండర్ సెక్షన్ 67 బి.ఐటి యాక్ట్ అండ్ ఫోక్సో యాక్ట్ కింద ఎఫైర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడికి నీలి చిత్రాలను అమ్మిన వ్యక్తులు ఎవరు అనేది ఆరా తీస్తున్నారు.
