NTV Telugu Site icon

షాకింగ్: యువ దర్శకుడు కిడ్నాప్.. రూ. 30 లక్షలు డిమాండ్

chennai

chennai

సినిమా.. ఓ రంగల కల.. ఎన్నో ఆశలు.. కలలు.. ట్యాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ రంగంలోకి రావాలని ఆశపడతారు. కానీ విజయం అంత త్వరగా రాదు.. ఇప్పుడు స్టార్లగా నిలబడిన వారందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చినవారే.. ఇప్పుడు ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది తమ జీవితాలను పణంగాపెట్టి కష్టపడుతున్నారు. అయితే చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఒక యువ దర్శకుడు చేసిన పనిమాత్రం అందరికి షాక్ కి గురిచేయడమే కాకుండా పోలీసులకే చెమటలు పట్టించింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నై కి చెందిన ఒక పాతికేళ్ల యువకుడు హైదరాబాద్ లో ఉంటూ షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకుడిగా చేస్తున్నాడు. గత కొన్నిరోజుల నుంచి తనకు తానుగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాడు.ఆ విషయం ఇంట్లో చెప్పి తండ్రి రూ. 30 లక్షలు అడిగాడు. అందుకు తండ్రి తనవద్ద రూ. 5 లక్షలు ఉన్నాయని చెప్పి అవి ఇచ్చి పంపాడు. ఆ డబ్బు సరిపోని యువకుడు ఒక ప్లాన్ వేశాడు. తన స్నేహితుల వద్దకు వెళ్లి తనను కిడ్నాప్ చేసినట్లు డ్రామా ఆడమని చెప్పాడు. తన తండ్రికి ఫోన్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేయాలని కోరాడు. దీనికి వారు కూడా సరే అని అతడిని కిడ్నాప్ చేసి అతని తండ్రికి ఫోన్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. అందుకు తండ్రి తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినా వినిపించుకోకుండా కొడుకును చంపేస్తామని బెదిరించారు. దీంతో చేసేదేమి లేక సదరు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కిడ్నాప్ కేసు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులకు నిజం తెలిసి షాక్ అయ్యారు. దర్శకుడు కావడానికి ఆ యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించి, స్నేహితుడి ఇంట్లో ఉన్న అతనిని పట్టుకొని అరెస్ట్ చేశారు.