ఆగిఉన్న కారులో యువకుల పాడుపని.. ఇదేంటని అడిగిన బాలుడిని ఏం చేశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళీ పండగ.. స్కూల్ లేకపోవడంతో ఆ బాలుడు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటిదగ్గర అమ్మ తనకోసం స్వీట్స్ చేసి పెట్టిన విషయం గుర్తుతెచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న బాలుడికి ఇంటి బయట తమ కారు ఊగడం కనిపించింది. దీంతో బాలుడు కారు వద్దకు వెళ్లి చూడగా అతడికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన జమ్నాలాల్ శర్మకు హిమాన్షు శర్మ పదోతరగతి చదువుతున్నాడు. గురువారం దీపావళీ సెలవు కావడంతో స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వెళ్తున్న అతనికి తమ కారులో ఎవరో ఉన్నారని అనుమానామొచ్చింది. దీంతో కారు దగ్గరికి వెళ్లి డోర్ తీసి చూడగా ముగ్గురు యువకులు కారులో మద్యం సేవిస్తూ కనిపించారు. తమ కారులో ఇలాంటి పాడుపని చేయడంతో కోపం వచ్చిన హిమాన్షు.. ఎవరు మీరు..? మా కారులో మందు తాగుతున్నారేంటి అని నిలదీశాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు బాలుడు గట్టిగా అరవడంతో కోపోద్రిక్తులై అతడిని కారులోకి లాగి మందు తగ్గించడానికి ప్రయత్నించారు. బాలుడు నిరాకరించడంతో మద్యం మత్తులో కత్తితో అతడిని పొడిచి చంపారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
బాలుడి అరుపులు విన్న స్థానికులు కారు వద్దకు చేరుకొనేలోపు నిందితులు పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని స్థానికులు హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పండగ పూట కొడుకు మృత్యువాత పడడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!