Honeytrap: యోగా గురు.. హనీ ట్రాప్‌లో పడ్డాడు. ఏకంగా 50 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. కానీ అవతలి వ్యక్తులకు ధనదాహం తీరకపోవడంతో మరో 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని వేధించారు. దీంతో యోగా గురు పోలీసులను ఆశ్రయించాడు. ఫలితంగా ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆయన పేరు రంగారెడ్డి. స్వయంగా ఆయన ఓ రాజకీయ నాయకుడు.. అంతే కాదు ఒక యోగా టీచర్‌గానూ సేవలందిస్తున్నారు. దీనికి తోడు ఓ వెల్ నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుచేసి అక్కడ యోగా పాఠాలు చెబుతున్నారు…
READ ALSO: Banswada Mother Murder: కొడుకు కాదు యముడు..
యోగా టీచర్‌ని ట్రాప్ చేసిన ఇద్దరు లేడీస్
ఇక్కడ వరకు బాగానే ఉంది.. అయితే ఈ యోగా టీచర్‌ని ఇద్దరు లేడీస్ ట్రాప్ చేశారు. నిజానికి ఓ యువకుడు ఆ ఇద్దరు మహిళల వెనుక ఉండి డ్రామా స్టార్ట్ చేశాడు. ఇద్దరు మహిళలను యోగా గురు రంగారెడ్డి నిర్వహిస్తున్న ఆశ్రమానికి పంపించాడు. వారు తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఆశ్రమంలో చేరారు. అలా చేరిన ఆ ఇద్దరు మహిళలు.. యోగా గురువు రంగారెడ్డితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరు మహిళలు రంగా రెడ్డితో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇంకేముంది మాస్టారు కాస్తా హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారు…
భయపడి రూ.50 లక్షలు
ఆ తర్వాత అసలు కథ షురూ చేశారు కేటుగాళ్లు. ఈ సమయంలో అమర్ అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మేము అడిగినన్నిడబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరించారు. వారి బెదిరింపులకు భయపడి పోయిన యోగా గురువు రంగారెడ్డి వెంటనే వారికి రూ. 50 లక్షల చెక్కు ఇచ్చాడు…
రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్
కొద్ది రోజులు గడిచిన అనంతరం మళ్లీ అమర్ గ్యాంగ్.. యోగా గురువు రంగారెడ్డికి ఫోన్ చేసి రూ.2 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు త్వరగా ఇవ్వాలంటూ ప్రతిరోజూ యోగా గురువుకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. రోజు రోజుకీ వారి వేధింపులు మితి మీరిపోవడంతో భరించలేక యోగా గురువు రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం అమర్ గ్యాంగ్‌కి చెందిన ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చెక్కులు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు…
READ ALSO: Hardik Pandya New Relationship: హార్దిక్ పాండ్యా మళ్లీ ప్రేమలో పడ్డాడా.. ఎవరా రూమర్ గర్ల్‌ఫ్రెండ్
