AP Crime: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎంతో మంది దాని ఉచ్చులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితులు.. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెంది ఓ ఇల్లాలి ప్రాణం కూడా తీసింది ఇన్‌స్టాగ్రాం పరిచయం.. తెలియని వ్యక్తితో పరిచయం పెంచుకున్న వివాహిత.. చాటింగ్ మోజులో పడిపోయింది.. తన జీవితాన్నే కోల్పోయింది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తికి నాలుగు లక్షల నగదు, బంగారం ఇచ్చేసింది.. దీంతో.. ఇంట్లో గొడవలు ప్రారంభం అయ్యాయి.. చివరకు ఆమె ప్రాణాలు తీసుకుంది..
Read Also: Rohit Sharma: ఐపీఎల్ 2025లో ఏ టీమ్‌కు ఆడుతావ్.. అభిమాని ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇదే! (వీడియో)
తూర్పుగోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహితకు స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అడుగు పెట్టింది.. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూ.. షేర్ చేస్తూ.. లైక్‌లు కొడుతూ గడిపేది.. అయితే.. ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆపై వారిద్దరూ మధ్య చాలా కాలం చాటింగ్ నడిచింది. ఈ సమయంలో వివాహితను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడు సదరు వ్యక్తి.. అతడి మాట మైకంలో పడిపోయిన వివాహిత.. ఆమె దగ్గర ఉన్న విలువైన బంగారు నగలతో పాటు నాలుగు లక్షల రూపాయల నగదు కూడా ఇచ్చేసింది.. అయితే, ఆ తర్వాత బంగారు ఆభరణాలు విషయమై ఇంట్లో వాళ్లు ప్రశ్నించడంతో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఒక పాప ఉన్నట్లుగా చెబుతున్నారు.. అయితే, మృతురాలి తమ్ముడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్టాలో పరిచయమై.. అందినకాడికి నగలు.. డబ్బు దండుకున్న వ్యక్తి.. విశాఖపట్నం చెందినవాడిగా గుర్తించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు. నిందితుడు గతంలో ఇంకా ఎవరైనా మోసం చేశాడా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..