NTV Telugu Site icon

Live-In Partner: లివ్-ఇన్‌లో ఉన్న మహిళని చంపేసిన వ్యక్తి.. 8 నెలలుగా ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.

పింకీ జూన్ 2024లో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత 8 నెలలుగా మృతదేహాన్ని ఫ్రిజ్‌లోనే ఉంచాడు నిందితుడు. దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వారు ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో, ఇంట్లోకి వెళ్లి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రిజ్‌లోని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read Also: Bihar Scam: ‘‘పిల్లలు లేని మహిళలని గర్భవతిని చేయండి, రూ.10 లక్షలు పొందండి’’..

ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్‌లో నివసిస్తున్నాడు. శ్రీవాస్తవ ఈ ఇంటిని జూన్ 2023లో ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్‌కి అద్దె ఇచ్చారు. పాటిదార్ 5 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరు భార్యభర్తలమని చెప్పి ఇరుగుపొరుగు వారిని నమ్మించారు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే పాటిదార్ తన స్నేహితుడి సాయంతో పింకీని చంపేసినట్లు తెలుస్తోంది. పాటిదార్‌కి అప్పటికే వివాహం అయింది.

ఇల్లు అద్దెకు తీసుకున్న ఒక ఏడాది తర్వాత పాటిదార్ ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే, తన సామన్లను మాత్రం స్టడీరూమ్, మాస్టర్ బెడ్‌రూంలో ఉంచడం కొనసాగించాడు. త్వరలోనే ఖాళీ చేస్తానని చెప్పినట్లు ఓనర్ శ్రీవాస్తవకు చెప్పాడు. పాటిదార్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని, ప్రస్తుతం ఇంటిలో ఉంటున్న అద్దెదారుడు ఇంట్లోని ఒక పోర్షన్‌ని తెరవాలని ఇంటి యజమానిని అడిగాడు. ఇంటి యజమాని ఇంటిలోని ఈ భాగాన్ని అద్దెదారుడికి చూపించాడు. కానీ పాటిదార్ వస్తువులు లోపల ఉండటంతో మళ్లీ అన్‌లాక్ చేశాడు. బుధవారం విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఫ్రిజ్‌లో ఉన్న మహిళ మృతదేహం నుంచి కుళ్లిపోయిన వాసన రావడం ప్రారంభమైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పాటిదార్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments