NTV Telugu Site icon

USA: టీనేజ్ అబ్బాయిలే ఆమె టార్గెట్.. 14 ఏళ్ల బాలికగా నటిస్తూ పాడు పని..

Usa

Usa

USA: అమెరికాలో ఓ యువతి టీనేజ్ అబ్బాయిలను టార్గెట్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతోంది. 14 ఏళ్ల అమ్మాయిగా తనను తాను పరిచయం చేసుకుని టీనేజ్ అబ్బాయిలతో సంబంధాన్ని పెంచుకుని వారితో శృంగార కార్యకలాపాలకు పాల్పడింది. బాధితులతో స్నాప్‌చాట్ ద్వారా కాంటాక్ట్ అయ్యేది. ఈ కేసులో అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని టంపాకి చెందిన అలిస్సా ఆన్ జింగర్(23) అనే యువతి 12 మరియు 15 ఏళ్ల మధ్య కలిగిన టీనేజ్ అబ్బాయితో లైంగిక సంబంధాన్ని పెట్టుకుంది.

Read Also: UP Horror: అబార్షన్ మాత్రలకు నో చెప్పిందని, మహిళకి యాసిడ్ తాగించి హత్య..

ఇలాంటి కేసులోనే గత నవంబర్‌లో అరెస్ట్ చేయబడిన ఆమె, ప్రస్తుతం మరోసారి అరెస్టైంది. 14 ఏళ్ల బాలికగా నటిస్తూ, తాను ఇంటి నుంచే చదువుకుంటున్నట్లు బాధితులతో చెప్పేది. ఇలా టీనేజర్లను ఆకర్షించి వారితో సంబంధాలు నెరిపేది. విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినందుకు, అనుచిత వీడియోలను పంపినందుకు తొలిసారిగా ఆమెను నవంబర్‌లో అరెస్ట్ చేశారు. 7500 డాలర్ల బాండ్ చెల్లించిన తర్వాత ఆమెను విడుదల చేశారు. జింగర్ ఓ మిడిల్ స్కూల్ టీనేజ్ విద్యార్థితో 30 సార్లు లైంగిక చర్యలకు పాల్పడినందుకు నవంబర్‌లో అరెస్తైంది. ప్రస్తుతం మరో నలుగురు బాధితులు కూడా ఆమె లైంగిక నేరాల గురించి అధికారులకు వెల్లడించారు. దీంతో ఆమెను మరోసారి అరెస్ట్ చేశారు. 2001లో జన్మించిన అలిస్సా జింగర్, తాను 2009లో జన్మించినట్లు చెప్పుకునేదని పోలీసులు విచారణలో తేలింది.