Site icon NTV Telugu

Karnataka: మూగవాడైన కొడుకుని మొసళ్లు ఉండే నదిలో విసిరేసిన తల్లి..

Woman Throws Mute Son In Crocodile Infested River After Fight With Husband

Woman Throws Mute Son In Crocodile Infested River After Fight With Husband

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య మూగవాడైన కన్నకొడుకుని మొసళ్లు ఉంటే నదిలో పారేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఉత్తర కన్నడి జిల్లాలో జరిగింది. జిల్లాలోని దండేలి తాలూకాకు చెందిన భార్య, భర్తల మధ్య పెద్ద కొడుకు అంగవైకల్యంపై తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగానే మరోసారి భార్య సావిత్రి, భర్త రవికుమార్(27) మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఎందుకు మూగ బిడ్డకు జన్మనిచ్చావని, అతడిని దూరంగా తీసుకెళ్లు అని కొన్నిసార్లు భర్త, భార్యకు చెప్పేవాడని పోలీసులు తెలిపారు.

Read Also: Chandrababu: కిరణ్ కుమార్ రెడ్డి, జయచంద్రా రెడ్డిని గెలిపించండి

ఈ జంటకు ఆరు, రెండేళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కొడుకు పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టాడు. పెద్ద కొడుకు విషయంలో భార్యభర్తలకు గొడవ జరుగుతుండేది. శనివారం సాయంత్రం కూడా మరోసారి గొడవ జరగగా, సావిత్రి తన పెద్ద కొడుకును మొసళ్లు ఎక్కువగా ఉండే కాళీ నదితో కలిసి కాలువలో విసిరేసింది. దీనిపై ఇరుగుపొరుగు వారు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకునే సమయానికి స్థానికులు, డైవర్ల సాయంతో చిన్నారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, చీకటి పడిపోవడంతో పోలీసులకు చిన్నారి ఆచూకీ లభించలేదు.

ఆదివారం ఉదయం పోలీసులు పిల్లవాడి మృతదేహాన్ని కనుగొన్నారు. శరీరంపై కాటు గుర్తులు, తీవ్రగాయాలు ఉన్నాయి. పిల్లవాడి ఒక చేయి లేదు. మొసలి దాడి చేసి ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version