NTV Telugu Site icon

Woman SI Affair: డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..

Woman Si Affair

Woman Si Affair

Woman SI Chitra Killed Her Husband For Extramarital Affair in Tamilnadu: ఆమె ఒక మహిళా ఎస్సై. నలుగురికి రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంది. కానీ, కామంతో కళ్లుమూసుకుపోయి ఓ క్షమించరాని నేరం చేసింది. డ్రైవర్‌తో తన రాసలీలలు సాగించేందుకు.. అడ్డుగా ఉన్నాడని భర్తని అంతమొందించింది. ఇందుకు ఓ జ్యోతిష్యురాలి సహకారం తీసుకుంది. మరో విచారకరమైన విషయం ఏమిటంటే.. తల్లి చేసిన నేరానికి కొడుకు కూడా మద్దతు తెలపడం. ఆమె చెప్పినట్టుగానే తలూపుకుంటూ పోయాడు. చివరికి పోలీసులు ఈ కేసుని ఛేధించడంతో, ఇప్పుడు అందరూ జైలు పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

కొబ్బరికాయ పగలగొడితే అందులో పువ్వు వస్తే మంచిదేనా?

క్రిష్ణగిరి జిల్లా కల్లావి ప్రాంతానికి చెందిన సెందిల్‌ కుమార్‌ (48) హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేసేశాడు. అయితే.. అక్రమాలకు పాల్పడటంతో చాలా ఏళ్ల కిందటే ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి చిత్ర (44) అనే భార్య, జగదీష్‌కుమార్ (19) అనే కొడుకు ఉన్నాడు. భార్య చిత్ర సింగారపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తోంది. కట్ చేస్తే.. గత సెప్టెంబర్ 16వ తేదీన సెందిల్‌కుమార్ ఆకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎక్కడా అతని జాడ కనిపించలేదు. దీంతో.. అతని తల్లి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అయితే.. తామే సెందిల్‌కుమార్‌ని హత్య చేశామంటూ ఈనెల 14వ తేదీన అతని కొడుకు జగదీష్‌కుమార్, అతని కారు డ్రైవర్‌ కమల్‌రాజ్‌ (37) లొంగిపోయారు. వాళ్లు అలా లొంగిపోవడంపై అనుమానం కలిగిన పోలీసులు.. మరింత లోతుగా విచారించగా, చిత్ర నిజస్వరూపం బయటపడింది.

Mega Star Chiranjeevi: మెగాస్టార్‌కు సోలో హీరోగా చేయడం ఇష్టం లేదా?

చిత్రకు కారు డ్రైవర్ కమల్‌రాజ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసి.. ఆ ఇద్దరినీ నిలదీశాడు. అప్పటినుంచి కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని.. పావకల్‌ గ్రామానికి చెందిన జ్యోతిష్యురాలు సరోజని సంప్రదించింది. తనకు రూ.10 లక్షలిస్తే.. తన కూలీలతో సెందిల్‌కుమార్ హత్య చేయిస్తానని సరోజ చెప్పింది. అందుకు సరేనన్న చిత్ర, ఆమెకు ఆ మొత్తాన్ని అందజేసింది. పథకం ప్రకారం సెంథిల్‌ని హతమార్చి, శవాన్ని పొదల్లో పడేశారు. సరోజని అదుపులోకి తీసుకున్నాక.. చిత్ర పాత్ర ఉన్నట్లు బయటపడింది. ఈ కేసులో పోలీసులు మొత్తం నలుగుర్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కూలీల కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. పొదల నుంచి సెందిల్ మృతదేహాన్ని వెలికితీసి.. ఆసుపత్రికి తరలించారు.

Twitter Data Leak: చరిత్రలో అతిపెద్ద డేటా లీక్.. అమ్మకానికి 40 కోట్ల మంది వివరాలు

Show comments