NTV Telugu Site icon

UP: “నిత్య పెళ్లికూతురు”.. ఆరుగురిని పెళ్లాడిని మహిళ, ఏడో ప్రయత్నంలో అరెస్ట్..

Up

Up

UP: డబ్బుల కోసం మగాళ్లను పెళ్లాడుతున్న ఓ లేడీ ఖిలాడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘నిత్య పెళ్లికూతురు’’ మారిన మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బండాకి చెందిన ఇద్దరు మహిళలు చాలా మంది మగాళ్లను, ఒంటరి పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసి, వారి ఇళ్లలోని నగదు, ఆభరణాలను దొంగిలించే రాకెట్ నడుపుతున్నట్లు తేలింది.

పోలీసులు వివరాల ప్రకారం.. పూనమ్ అనే మహిళ పెళ్లి కూతురుగా, సంజనా గుప్తా అనే మహిళ ఆమె తల్లిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి అనే ఇద్దరు వ్యక్తులు అమాయకులను గుర్తించి వారిని పూనమ్‌కి పరిచయం చేస్తారు. పెళ్లి సంబంధం చూసినందుకు డబ్బు చెల్లించాలని పెళ్లి కొడుకులను అడుగుతారు. కోర్టు మ్యారేజ్ తర్వాత పెళ్లి కూతురుగా పూనమ్ వరుడి ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత అతడి ఇంటి నుంచి నగదు, డబ్బు దొంగిలించి పారిపోతుంది.

Read Also: Syria: అసద్ భార్య యూకేలో లేదు.. తేల్చి చెప్పిన బ్రిటన్ పీఎంవో

అయితే, ఇలా ఆరుగురు వ్యక్తుల్ని పెళ్లాడి మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఏడో వివాహానికి సిద్ధమవుతున్న తరుణంలో పూనమ్ అరెస్ట్ జరిగింది. శంకర్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తను ఒంటరిగా ఉన్నానని, పెళ్లి సంబంధం కోసం చూస్తున్నానని చెప్పాడు. విమలేష్ అతడిని కలిసి, పెళ్లి సెట్ అయ్యేలా చూస్తామని చెప్పారు. రూ. 1.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీనికి ఉపాధ్యాయ కూడా అంగీకరించారు.

శనివారం విమలేష్ తనను కోర్టుకు పిలిచి పూనమ్‌ని పరిచయం చేశాడని ఉపాధ్యాయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రూ. 1.5 లక్షలు అడిగారు. అయితే, ఎందుకో అనుమానించిన ఉపాధ్యాయ పూనర్, ఆమె తల్లిగా నటించిన సంజనల ఆధార్ కార్డులు అడిగారు. దీంతో తనను మోసం చేస్తున్నారని గుర్తించాడు. తాను పెళ్లికి నిరాకరించిన సమయంలో తనను చంపేస్తామని ముఠా బెదిరించిందని, తనకు సమయం కావాలని తప్పించుకుని వచ్చినట్లు ఉపాధ్యాయ పోలీసులకు వెల్లడించారు. చివరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Show comments