NTV Telugu Site icon

Extramarital Affair: ప్రియుడితో కలిసి భార్య స్కెచ్.. ఇంట్లోకి రాగానే..

Woman Kills Husband

Woman Kills Husband

Woman Kills Her Husband For Insurance Money With Help Of Boyfriend: పెళ్లి సమయంలో ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకునే దంపతులు.. కొంతకాలం తర్వాత వివాహేతర సంబంధాల మోజులో పడి, తమ దాంపత్య జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఇంకొందరైతే.. మరో అడుగు ముందుకేసి, కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. కేవలం కామకోరికలు తీర్చుకోవడం కోసం.. అయినవారు అడ్డంగా ఉన్నారంటూ చంపేస్తున్నారు. తాజాగా ఒక మహిళ కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టింది. భర్తని వదిలి ప్రియుడితో జీవించాలని అనుకుంది. అయితే.. అందుకు డబ్బు కావాలి కాబట్టి, భర్త హత్యకు ప్లాన్ చేసింది. భర్త మరణిస్తే బీమా డబ్బులొస్తాయని, అప్పుడు ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చని స్కెచ్ గీసింది. చివరికి తానేసిన కుట్ర అడ్డం తిరగడంతో, ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Surreal Landscapes: ప్రపంచంలో ఊహకందని 10 అద్భుత ప్రకృతి దృశ్యాలు

జార్ఖాండ్‌లోని ఖుంటి జిల్లాకు చెందిన వాసిల్ సూరిన్‌కి చాలాకాలం క్రితమే మరియం అనే మహిళతో వివాహం అయ్యింది. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే.. కొంతకాలం క్రితం మరియంకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడిపై మోజు పెంచుకున్న మరియం.. అతనితోనే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. అయితే.. వారి వద్ద బతకడానికి డబ్బులు లేవు. డబ్బు లోటు లేకుండా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలని అనుకున్నారు. అప్పుడే మరియంకు ఒక ఐడియా తట్టింది. తన భర్తని చంపితే.. రూ.20 లక్షల బీమా డబ్బులు వస్తాయని భావించింది. దీంతో.. తన ప్రియుడితో కలిసి భర్తని చంపేందుకు ఓ కుట్ర పన్నింది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే.. భర్త అడ్డు తొలగిపోవడంతో పాటు రూ.20 లక్షలు కూడా డబ్బులు వస్తాయని, అప్పుడు సంతోషంగా ఉండొచ్చని అనుకున్నారు.

Mount Guatape – Katie Black: పవిత్ర ప్రదేశంలో బూతు పని.. దుమ్మెత్తిపోసిన ప్రజలు

ప్లాన్ ప్రకారం.. తన భర్త ఇంట్లోకి రాగానే మరియం తలుపులన్నీ మూసేసింది. కాసేపు అమాయకురాలిగా నటించింది. అతడ్ని మాటల్లో దింపింది. ఈ క్రమంలో రాడ్ తీసుకొని, వెనుక నుంచి భర్తపై ఎటాక్ చేసింది. ఈ ప్రమాదంలో వాసిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించి, తాను ఎస్కేప్ అవ్వాలని మరియం ప్రయత్నించింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న తర్వాత.. ఈ ప్రమాదం ఎలా జరిగిందని మరియంను ప్రశ్నించారు. అప్పుడు ఆమె పొంతన లేని సమాధానం చెప్పడంతో, ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో.. తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు, కేవలం 72 గంటల్లోనే మరియంను, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు.