NTV Telugu Site icon

Extramarital affair: ఛీ నువ్వు తల్లివేనా..? లవర్‌తో పారిపోయేందుకు కూతురి హత్య.. “క్రైమ్ పెట్రోల్‌” ఐడియా..

Bihar Crime

Bihar Crime

Extramarital affair: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ తల్లి. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి, 3 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపింది. ప్రియుడితో వెళ్లేందుకు ఈ ఘతుకానికి పాల్పడింది. బీహార్ ముజఫర్‌పూర్‌లో సూట్‌కేస్‌లో మూడేళ్ల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న కాజల్ అనే మహిళ, తన భర్తను విడిచిపెట్టి ప్రియుడితో వెళ్లిపోవాలిని భావించింది. ఇందుకు అడ్డుగా ఉన్న తన కుమార్తెని పాశవికంగా హత్య చేసింది.

ప్రియుడు తన కుమార్తెతో ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. చిన్నారి గొంతు కోసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పొదల్లో పారేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పాపులర్ టీవీ షో ‘‘ క్రైమ్ పెట్రోల్’’ చూసి తన కూతురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.

Read Also: Bandi Sanjay-KTR: కవితకు బెయిల్ మంజూరుపై మాటల యుద్ధం.. బండి సంజయ్ vs కేటీఆర్

శనివారం ముజఫర్‌పూర్‌లోని మినాపూర్ పరిసరాల్లో రెడ్ ట్రాలీ సూట్‌కేసులో మూడేళ్ల మిస్తీ అనే బాలిక మృతదేహం లభించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యని దర్యాప్తు చేసేందుకు పోలీసులు స్పెషట్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ టీములను రంపించి విచారణ వేగవంతం చేశారు. బాలిక కుటుంబంపై అనుమానంతో వారి ఇంటిని సోదా చేయగా నేలపై, సింక్, టెర్రస్‌‌పై రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. మిస్తీ తల్లి కాజల్ కనిపించకుండా పోయిందని, ఘటన జరిగిన రోజు భర్త మనోజ్‌కి ఫోన్ చేసి పుట్టింటికి వెళ్తున్నట్లు చెప్పిందని పోలీసులు గుర్తించారు.

మనోజ్ తన భార్య కాజల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కాజల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయడంతో ఆమె తన ప్రియుడి ఇంట్లో దొరికింది. విచారణతో కాజల్‌కి వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు బిడ్డను అడ్డు తొలగించుకున్నట్లు చెప్పింది. కూతురిని తీసుకుని వెళ్లాలనుకున్నప్పటికీ ప్రియుడు దీనికి ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసింది. హత్య ఆనవాళ్లు చెరిపేసేందుకు రక్తపు మరకలను తొలగించాలని చూసింది. క్రైమ్ పెట్రోల్ షో చూసే అలవాటు ఉన్న కాజల్, ఓ ఎపిసోడ్‌లో చూసిన విధంగా బిడ్డను చంపి, సూట్‌కేస్‌లో పెట్టినట్లు తేలింది. అయితే, ఈ హత్యలో ఆమె ప్రియుడి ప్రమేయం ఉన్నట్లుగా, ఇందుకు అతను ప్రభావితం చేసినట్లుగా తేలలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు.

Show comments