Site icon NTV Telugu

Extramarital Affair: భార్య కిరాతకం.. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి..

Woman Killed Husband

Woman Killed Husband

Woman Killed Her Husband With Help Of Boyfriend In Kurnool: ప్రియుడి మోజులో ఒక భార్య కిరాతక పనికి పాల్పడింది. కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా చంపింది. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి.. భర్తని అంతమొందించింది. అనంతరం ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం పెద్ద స్కెచ్ వేసింది. తన భర్తను చంపేశాక, భర్త కనిపించడం లేదంటూ పెద్ద డ్రామా ఆడింది. తీరా తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు.. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో భార్య బాగోతం మొత్తం బయటపడింది, అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం తన ప్రియుడితో కలిసి ఆ మహిళ జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Uniform Bites By Rats: హవ్వ.. యూనిఫాం ఎలుకలు కొరికేశాయట..

మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణకు 2008లో దేవనకొండ మండలం తెర్నేకల్‌ గ్రామానికి చెందిన ఉప్పర వరలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కట్ చేస్తే.. ఉప్పర నారాయణ మద్యానికి బానిస కావడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా భర్త మారకపోవడంతో.. వరలక్ష్మి విసుగుచెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు.. ఆమెను మందలించి పుట్టినిల్లుకు పంపించారు. ఆ భాధలో ఆమె తన సమీప బంధువు అయిన గోవిందుకు ఫోన్ చేసి, జరిగిన విషయం చెప్పింది. ఇలా వీరి మధ్య సంభాషణలు పెరగడంతో.. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే గోవిందుతో కలిసి, తన భర్తను అంతం చేయాలని వరలక్ష్మి పథకం రచించింది.

US Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు దుర్మరణం

2022 మే నెల 27వ తేదీన.. చిన్న గోవిందుతో కలిసి తన భర్త ఉప్పర నారాయణకు ఫోన్ చేసింది. వెంటనే ఎమ్మిగనూరుకు రావాలని కోరగా.. అతడు బయలుదేరి వెళ్లాడు. అక్కడి నుంచి బెళగల్‌కు, అనంతరం కర్నూలుకు వెళ్లారు. నారాయణకు ఫుల్‌గా మద్యం తాపించి, రాత్రి 10 గంటలకు కర్నూలు రైల్వే స్టేషన్‌ వద్దకు వచ్చారు. కొంత దూరం నడుచుకొని వెళ్లాక.. మద్యం మత్తులో ఉన్న నారాయణను రైల్వే ట్రాక్‌పై పడుకోబెట్టారు. ఆ టైంలో హైదరాబాద్‌ నుంచి కర్నూలు వస్తున్న రైలు నారాయణ పైనుంచి వెళ్లడంతో.. అతడు మరణించాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న గోవిందు.. నారాయణ సెల్‌ఫోన్‌లోని సిమ్‌ కార్డును మరో సెల్‌ఫోన్‌లో మార్చి, మహిళ వాయిస్‌ వచ్చేలాగా సిట్టింగ్‌ చేసుకుని.. ఆ నంబర్‌ వచ్చే కాల్స్‌ స్వీకరించడం మొదలుపెట్టారు.

Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్ హీట్ ఎక్కించడంలో నెంబర్ 1

కట్ చేస్తే.. 2022 మే 30వ తేదీన తన భర్త నారాయణ కనిపించడం లేదని భార్య వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. పోలీసులకు అనుమానం వచ్చి, వరలక్ష్మి కాల్ డేటాని పరిశీలించారు. ఇంకేముంది.. వారిద్దరి బండారం బట్టబయలు కావడంతో, వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో.. తామే నారాయణను చంపినట్టు గోవిందు, వరలక్ష్మి తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version