Site icon NTV Telugu

Chittoor Crime: దారుణం.. తన కూతురుని కోడలిగా చేసుకోలేదని స్నేహితురాలి హత్య..! కులాలే కారణమా..?

Warangal Crime

Warangal Crime

Chittoor Crime: ప్రతీ రోజూ ఏదో ఒక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. ఒక్కో మర్డర్‌ వెనుక.. ఒక్కో స్టోరీ ఉంటుంది.. అయితే, చిత్తూరులో జరిగిన ఓ హత్య ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా తీస్తే, పక్కింటిలో ఉన్న స్నేహితురాలు నదియానే సరోజను హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

Read Also: Metro Phase II: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIను మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

అయితే, సరోజ-నదియా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.. ఇద్దరూ వియ్యంకురాళ్లు కావాలని అనుకున్నారు.. ఇందులో భాగంగానే చిత్తూరు శివారు ప్రాంతం యాదవ కాలనీలో ఉన్న సరోజ – నదియాల కులాలు వేరైనా స్నేహంగానే చాలా కాలం మెలిగారు. సరోజకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉండగా.. చిన్న కొడుకు కన్నన్‌కు నదియా కూతురుతో పెళ్లి చేయాలని భావించారు. జూన్ 12వ తేదీన నదియా-సరోజలు ఇద్దరూ ఇంటి వద్దే మద్యం కూడా సేవించారు. మాటల్లో కూతురును సరోజ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న నదియా కూతురు పెళ్లి ప్రస్తావన సరోజతో తెచ్చింది. ఇక్కడే కులం అడ్డొచ్చింది. కులాలు వేరుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్నేహితులుగా ఉన్న వారి మధ్య ఒక్కసారి వచ్చిన కులం ప్రస్తావనే గొడవకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న సరోజను ప్లాస్టిక్ కవర్ కప్పి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చింది నదియా.. స్నేహిరాలినే హంతకురాలిని చేసింది. ఒకరిని హత్య చేసే దాకా పరిస్థితిని తీసుకెళ్ళింది.

Read Also: Israel: సద్దాం హుస్సేన్‌ని మొసాద్ చంపాలనుకుంది.. కానీ, దారుణంగా విఫలమైన ఇజ్రాయిల్..

సరోజ మంచంపై మృతి చెంది ఉండటంతో.. సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు జూన్ 13వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న పిల్లోడు సరోజ మరణంపై నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టాడు. సరోజ కొడుకు కన్నన్‌కు సరోజ మర్డర్‌లో నదియా పాత్రను బయటపెట్టాడు. సరోజకు ఫుల్ గా మద్యం తాగించి, మత్తులో ఉండగా ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పి దిండుతో నొక్కి చంపిందని ఆ కుర్రాడు చెప్పాడు. దీంతో తల్లి సరోజది సహజ మరణం కాదని, హత్య చేసినట్లు భావించిన కొడుకు కన్నన్ చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తిరుమలలో నిందితురాలు నదియాను అదుపులోకి తీసుకన్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. సరోజ కొడుకుకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని నదియా ప్రపోజల్ పెట్టగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న సరోజ, నదియా కులం ఏంటని నిలదీసింది. కులాన్ని దూషించిన సరోజపై నదియాకు కోపం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న సరోజను నదియా హతమార్చింది. హత్య చేసినట్లు పోలీసుల ముందు వెల్లడించింది. దీంతో సరోజను అరెస్టు చేసి డిమాండ్ కు తరలించారు పోలీసులు.

Exit mobile version