NTV Telugu Site icon

Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..

Woman Suicid

Woman Suicid

Woman Commits Suicide Due To Dowry Harassment In Karnataka: పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని, అత్తారింట్లో చాలా ఎగ్జైటింగ్‌గా లైఫ్ సాగుతుందని ఆ యువతి ఎన్నో కలలు కంది. తాను కలలు గన్న రాకుమారుడే భర్తగా వచ్చాడని భావించి, అతనితో సరికొత్త జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించింది. కానీ.. పెళ్లైన కొన్నాళ్లకే ఆ యువతి కోరికలన్నీ నీరుగారిపోయాయి. తాను పెళ్లి చేసుకుంది రాకుమారుడ్ని కాదని, రాక్షసుడినని తెలుసుకుంది. అతనితో పాటు కుటుంబ సభ్యులు సైతం తనని వేధింపులకు గురి చేయడంతో.. చావే శరణమని భావించి, సూసైడ్ చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Naxals Audition for Movie: సినిమాల్లోని రియల్ నక్సలైట్లు.. గడ్చిరోలిలో మూవీ ఆడిషన్

చిక్కబళ్లాపురం నగరం కార్కానపేటలో నివసిస్తున్న లోహిత్‌‌కు బెంగళూరు రూరల్‌లోని విజయపురకు చెందిన తేజస్వినితో (28) ఏడాది క్రితం పెళ్లి అయ్యింది. ఇంజనీరింగ్‌ పూర్తి తేజస్విని.. ఇంట్లో ఏకైక కూతురు కావడంతో, తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. తన కూతురి జీవితం బాగుండాలని.. లోహిత్‌కు భారీగా కట్న కానుకలు ఇచ్చి, పెళ్లి చేశారు. మొదట్లో వీరి సంసార జీవితం సజావుగానే సాగింది. కానీ, కొన్ని రోజుల తర్వాత తేజస్వినికి తన భర్తతో పాటు అన్న, వదినల నుంచి వేధింపులు మొదలయ్యాయి. పుట్టినింటి నుంచి మరింత డబ్బు తేవాలని, అలాగే భూమి రాయించుకు రావాలని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లు హింసించిన ప్రతీసారి.. తేజస్విని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, బోరుమని విలపించేది. పేరెంట్స్ ఆమెను సర్దిచెప్పి, తిరిగి అత్తారింటికి పంపించేవారు.

Prabhas: ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో.. దటీజ్ ప్రభాస్

అయితే.. రానురాను భర్త, అన్న, వదినల వేధింపులు మరీ ఎక్కువైపోయాయి. ఆ వేధింపులు భరించలేకపోయిన తేజస్విని, ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడమే శ్రేయస్కరమని అనుకుని, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన తేజస్విని తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. భర్త లోహిత్, అతని అన్నయ్య, వదినలు టార్చర్ పెట్టడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని.. హంతకుల్ని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు.. పోలీసులు రంగంలోకి దిగి భర్త లోహిత్‌ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే.. డెత్ నోట్‌తో పాటు తేజస్వినికి సంబంధించిన కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.

Show comments