అర్ధరాత్రి లవర్స్ శృంగారం చేస్తుండగా చూసిన మహిళ.. తెల్లారేసరికి శవంలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక తప్పు.. ఎన్నో తప్పులకు నాంది పలుకుతుంది.. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు.. ప్రస్తుతం సమాజంలో ఇలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసేవాళ్ళే ఎక్కువ.. తాజాగా తాము చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న అమరతియా గ్రామంలో కంకుభాయి(42) అనే మహిళ కుటంబంతో కలిసి నివసిస్తోంది. వారికి ఆ గ్రామంలోనే కొద్దిగా పొలం ఉండడంతో బార్యభర్తలిద్దరూ అక్కడే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. నిత్యం పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లిన భర్తకు భోజనం తీసుకొని వెళ్తోంది కంకుభాయి. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం కూడా భర్తకు భోజనం తీసుకొని పొలానికి బయల్దేరింది. భర్తకు భోజనం పెట్టాలని హడావిడిగా బయల్దేరిన ఆమెకు మార్గ మధ్యంలో ఒక ప్రేమ జంట శృగారం చేస్తూ కనిపించారు. ఆ పరిస్థితిలో ఆ జంట ఆమెను చూసి షాక్ అయ్యారు. ఈ విషయం ఆమె ఎక్కడ ఊర్లో వారికి చెప్తుందో అని బయపడి దారుణానికి ఒడిగట్టారు. కంకుభాయిని పట్టుకొని, నోరునొక్కి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. ఆమె కాళ్లు నరికి తీసుకువెళ్లారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఉదయం పొలంలో కంకుభాయి శవం కనిపించడంతో గ్రామస్థులు ఏదైనా జంతువు ఈ పని చేసిందని అనుకున్నారు. అయితే మరి కాళ్లు ఏమైనట్లు అనే అనుమానం పోలీసులను తొలిచివేసింది. దీంతో ఆ పొలం చుట్టుపక్కల ఎవరు వచ్చారు అని ఆరాతీయగా ఆ రాత్రి పక్క గ్రామానికి చెందిన గోపి అనే యువకుడి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం అతడిని తమదైన రీతిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టాడు. తన ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమె చూసిందని, బయట ఎవరికైన చెప్తుందనే భయంతో తానే హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఆమె కాళ్లకు వెండి కడియాలు ఉన్నాయని, కాళ్లు నరికి తీసుకువెళ్తే దొంగతనం కింద వస్తుందని ఆ పని చేసినట్లు చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!