Site icon NTV Telugu

Ex-Girlfriend: బలవంతంగా ముద్దు.. నాలుక కొరికేసిన ఎక్స్-గర్ల్ ఫ్రెండ్..

Ex Girlfriend

Ex Girlfriend

Ex-Girlfriend: పెళ్లయిన వ్యక్తి, తన ఎక్స్- గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇవ్వాలని చూశారు. బలవంతంగా ‘‘కిస్’’ చేయాలని చూసిన ఆ వ్యక్తిని తగిన గుణపాఠం చెప్పింది. ముద్దు పెట్టుకోవాలని చూసిన వ్యక్తి, నాలుకను కొరికింది. దీంతో, నాలుక కొంత భాగం కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌‌లో ఈ ఘటన జరిగింది. లైంగికంగా వేధించడం, కిస్ చేయడానికి ప్రయత్నించడంతో సదరు మహిళ, ఆ వ్యక్తి నాలుకను రెండుగా ముక్కలయ్యేలా కొరికింది.

Read Also: Kanpur Scam: కోట్లు దోచుకున్న నిత్య పెళ్లికూతురు! బాధితుల్లో పోలీసులు, వైద్యులు మరెందరో..

కాన్పూర్‌లోని దరియాపూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి చంపి, ఆ మహిళతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఇది తెలిసిన అతడి తల్లిదండ్రులు వేరే అమ్మాయితో వివాహం జరిపించారు. అయితే, వివాహం నిశ్చయమైనప్పటి నుంచి చంపికి ఆ మహిళ దూరంగా ఉంటోంది. దీంతో చంపి తరుచుగా ఆ మహిళను కలిసేందుకు ప్రయత్నించేవాడని పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం, ఆ మహిళ పొయ్యి కోసం మట్టిని సేకరించడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లి మహిళను లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె తనను తాను రక్షించుకునేందుకు చంపి నాలుకను గట్టిగా కొరికి, కొంత భాగాన్ని కట్ చేసింది.

తీవ్ర రక్తస్రావం, నొప్పితో విలవిలాడిన చంపి గట్టిగా కేకలు వేయడంతో, స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కాన్పూర్‌లోని హాలెట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version