Site icon NTV Telugu

Maharashtra: టీవీ ఆఫ్ చేసినందుకు అత్త వేళ్లు కొరికిన కోడలు.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తనూ..

Woman Bites Mother In Law Finger

Woman Bites Mother In Law Finger

Maharashtra: చాలా ఇళ్లల్లో అత్తగారికి కోడలికి అస్సలు పొసగదు. మరికొన్ని ఇళ్లల్లో అత్తలో అమ్మను చూసుకుంటూ ఉంటాయి. అత్తా కోడళ్ల మధ్య గిల్లికజ్జాలు మామూలే అయిలే ప్రాణాలు పోగొట్టే స్థాయిలో గొడవలు అప్పుడప్పుడూ.. అక్కడక్కడా చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా టీవీ విషయంలో జరిగిన అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ.. అత్తగారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. టీవీ పెద్దగా శబ్ధం వస్తోందని అత్తగారు ఆఫ్ చేయగా.. టీవీ చూస్తున్న కోడలు కోపంతో అత్తగారి వేళ్లను కొరికేసిన ఘటన మహరాష్ట్రలో థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో చోటుచేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో ఆమె అత్తగారు టెలివిజన్ సెట్‌ను ఆఫ్ చేయడంతో కోపంతో 32 ఏళ్ల గృహిణి వృద్ధురాలి మూడు వేళ్లను కొరికిందని పోలీసులు బుధవారం తెలిపారు.

Gangster Ayub Khan Released: ఐదేళ్ల తరువాత విడుదలైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్

వృశాలి కులకర్ణి (60) తన ఇంట్లో పూజలు చేస్తుండగా.. ఆమె కోడలు విజయ కులకర్ణి టెలివిజన్ చూస్తుండగా ఈ సంఘటన జరిగిందని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. “సోమవారం ఉదయం వృశాలి భజనలు పాడుతుండగా.. టెలివిజన్ సౌండ్ తగ్గించమని విజయను కోరడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో అత్త వృశాలి టెలివిజన్ సెట్ ఆఫ్ చేయడంతో కోడలు వృద్ధురాలి చేయి పట్టుకుని మూడు వేళ్లను కొరికింది. జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా ఆమె కొట్టింది’’ అని పోలీసులు చెప్పారు. బాధితురాలు మూడు వేళ్ల కోడలు కొరకడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వృశాలి శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కోడలిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Exit mobile version