NTV Telugu Site icon

Delhi Crime: కాబోయే వాడితో కలిసి కన్నతల్లిని హతమార్చిన మహిళ..

Delhi Crime

Delhi Crime

Delhi Crime: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి తెగబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కాబోయే భర్తతో, మరో స్నేహితుడితో కలిసి కన్న తల్లినే హతమార్చింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద నాటకానికి తెరతీసింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు కన్న కూతురే నిందితురాలిగా తేల్చారు.

వివరాల్లోకి వెళ్తే.. నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో ఈ హత్య చోటు చేసుకుంది. కాబోయే భర్త, కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితులను మోనికా, ఆమెకు కాబోయే భర్త నరేలా నివాసి అయిన నవీన్ కుమార్, హర్యానాకు చెందిన నవీన్ కుమార్ స్నేహితుడు యోగిష్ అలియస్ యోగిగా గుర్తించారు.

Read Also: Kolkata Doctor Case: ఇంత అర్జెంట్ ఎందుకు..? ఆర్జీ కర్ ఆస్పత్రి పనులపై హైకోర్టు ప్రశ్న..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మహిళా కాలర్ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి, ఇంట్లో ఉన్న తన తల్లి స్పందించడం లేదని, పోలీసులు వెళ్లి తలుపు తీసి చూడాలని కోరింది. నజాఫ్‌గఢ్ మెయిన్ మార్కెట్‌లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో తన 58 ఏళ్ల తల్లి ఒంటరిగా నివసిస్తుందని మోనికా సోలంకిగా అనే మహిళ కాల్ చేసి చెప్పింది. ఒక రోజు ముందే ఆమె దగ్గరకు వెళ్లినట్లు , ఆమె బాగానే ఉందని చెప్పింది.

పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా లోపల బెడ్‌రూంలో నేలపై సుమిత్ర అనే మహిళ నుదిటిపై, కంటిపై, రెండు చేతులపై గాయాలతో విగతజీవిగా పడిఉంది. ఆమె నోటి వెంట రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. వెంటనే విచారించిన పోలీసులు భవనంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఒక మహిళలో పాటు మరో ఇద్దరు తెల్లవారుజామున 2.18 గంటల సమయంలో ఫ్లాట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. ఫుటేజీని స్పష్టంగా పరిశీలించగా ఫ్లాట్‌లోకి వెళ్తున్న వారిని హత్య చేయబడిన సుమిత్ర కుమార్తె మోనికాగా మరో ఇద్దర్ని నవీన్, యోగేష్‌గా గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Show comments