Site icon NTV Telugu

Tamil Nadu: 22 ఏళ్ల మహిళపై స్నేహితుల సామూహిక అత్యాచారం..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడు తంజావూరులో దారుణం జరిగింది. యువతిపై ఆమె స్నేహితులే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 22 ఏళ్ల బాధిత యువతి ఇంటికి సమీపంలోనే ఆమెపై ఈ దారుణం జరిగింది. యువతి స్నేహితుడితో పాటు అతడి సహచరులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సదరు యువతి సొంతూరికి వచ్చిన కొద్ది రోజులకే ఈ దారుణం జరిగింది.

Read Also: INDIA Alliance: మోడీని ప్రశ్నించే గొంతు ఇప్పుడెందు లేవదు.. “కోల్‌కతా వైద్యురాలి” ఘటనపై ఇండియా కూటమి మౌనం..

మహిళ మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సందర్భంలో, ప్రైవేట్‌గా కలవాలని ఆమె స్నేహితుడు అభ్యర్థించాడు. అందుకు ఆమె అంగీకరించింది. బాధితురాలి ఇంటికి ఎదురుగా ఉన్న షెడ్డు వద్దుకు వెళ్లింది. అక్కడే ఉన్న ఆమె స్నేహితుడు, అతని సహచరులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఒరటనాడు ఆల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కవిదాసన్, దివాకర్, ప్రవీణ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, నేరాన్ని ఫోన్‌లో చిత్రీకరించిన ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 17 ఏళ్ల బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాలతో బయటపడిన యువతి ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Exit mobile version