NTV Telugu Site icon

Wife Poisons Husband: భర్తకు కాఫీలో విషం పెట్టిన భార్య.. వేరే వ్యక్తితో మాట్లాడొద్దనడమే పాపమా..?

Wife Poisons Husband

Wife Poisons Husband

Wife Poisons Husband: భార్య దురాగతానికి మరో భర్త బలయ్యాడు. వేరే వ్యక్తితో మాట్లాడ వద్దని చెప్పడమే అతడికి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఏకంగా భర్త తాగే కాఫీలో విషం కలిపి అతడిని హతమార్చాలని ప్రయత్నించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లోని భగేలా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అనుజ్ శర్మ మీరట్‌‌లో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఇతడి భార్య పింకీ అలియాస్ సనాతో ఈ విషయమై తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదం గతంలో పోలీస్ స్టేషన్ జోక్యానికి కూడా దారి తీసింది.

Read Also: Protest : ట్రాన్స్‌జెండర్లను అవహేళన… బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర నిరసన

మార్చి 25న, పింకీ అనూజ్‌కి కాఫీలో విషం కలిపి ఇచ్చింది. దీని వల్ల అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఖతౌలిలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడంతో పెద్దాసుపత్రికి తరలించారు. అనుజ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అనుజ్ చికిత్స పొందుతున్నాడు.

అనుజ్‌కి రెండేళ్ల క్రితం ఫరూఖాబాద్ నివాసి, నిందితురాలైన పింకీతో వివాహమైంది. పెళ్లయిన రెండు నెలల తర్వాత నుంచి దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పింకీ ఇతర పురుషులతో మాట్లాడవద్దని కోరడంతో , తరుచుగా గొడవులు జరుగుతుండేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీస్ అధికారి రామ్ ఆశిష్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మీరట్‌లో ఇటీవల మర్చంట్ నేవీ అధికారిని భార్య దారుణంగా చంపిన ఘటన మరవకముందే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.