Tragedy : హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కోదండరాం నగర్ రోడ్ నంబర్–7లో నివాసం ఉంటున్న జెల్లెల శేఖర్ (40), భార్య చిట్టి (33) గత కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి భర్త శేఖర్ నిద్రలోకి జారుకున్న తర్వాత, చిట్టి తన ప్రియుడు హరీష్‌ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి శేఖర్‌పై దాడి చేసి హత్య చేశారు.
తరువాత ఏమి తెలియనట్లుగా ఉదయం భర్త నిద్రలోనే చనిపోయాడని చిట్టి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. ప్రారంభంలో ఇది సహజ మరణంగా అనిపించినప్పటికీ, పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, భర్తను తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు చిట్టి ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హరీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Crime News: అడవిలో అమ్మాయి డెడ్ బాడీ.. చుట్టూ క్షుద్రపూజల ఆనవాళ్లు!
