రోజురోజుకూ భార్యాభర్తల సంబంధాలు దిగజారిపోతున్నాయి. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. పక్కదారి పట్టి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడొక చోట నారీమణులు.. తమ భాగస్వాములను హతమారుస్తూనే ఉంటున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాదను కుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. కన్న కొడుకు చూస్తుండగానే భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు.
ఇది కూడా చదవండి: Stunt Master : షూటింగ్ సమయంలో ప్రమాదం – స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు మృతి
బీహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందిన ఉషా దేవి(35), బాలో దాస్ (45) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాలో దాస్ పంజాబ్‌లో కూలీగా పని చేస్తున్నాడు. అయితే ఉషా దేవి గ్రామంలో ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ప్రేమికుడితో వెళ్లిపోవాలన్న ఆలోచనతో భర్తకు సంబంధించిన ఆస్తిని అమ్మేందుకు ప్రయత్నించింది. అయితే సడన్‌గా భర్త గ్రామంలోకి వచ్చాడు. దీంతో భార్య బండారం బయటపడింది. ఆమెతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Tejeshwar Case: నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు.. అన్నా నన్నెందుకు చంపుతున్నారు అని వేడుకున్నా..
ఒక పదునైన ఆయుధంతో భర్త దాస్‌పై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. దాడి సమయంలో కుమారుడు శైలేంద్ర నిద్రలోంచి లేచాడు. రక్తం చిమ్మడంతో మెలుకువ వచ్చింది. అయితే ఎవరికైనా చెబితే నీకు ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించడంతో భయపడ్డాడు. తన తండ్రిని తల్లి చంపడం కళ్లరా చూసినట్లుగా శైలేంద్ర తెలిపాడు. అత్తకు చెప్పేందుకు ఉదయం వరకు వేచి ఉన్నట్లు బాలుడు చెప్పాడు. అనంతరం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. ప్రియుడితో పారిపోయేందుకు ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. తండ్రి హత్య.. తల్లి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
