NTV Telugu Site icon

Bengaluru: బెంగళూరులో దారుణం.. తల్లి సాయంతో భర్తను చంపిన ఇల్లాలు

Bengalurumurder

Bengalurumurder

భార్యాభర్తల సంబంధాలు రోజు రోజుకు దెబ్బతింటున్నాయి. కట్టుకున్నవాళ్లే కసాయిలుగా మారుతున్నారు. బంధాలను మరిచి కాటికి పంపిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్‌ను భార్య, ఆమె ప్రియుడి చంపిన ఘటనను ఇంకా మరువక ముందే బెంగళూరులో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి కట్టుకున్నవాడినే కాటికి పంపించింది ఓ ఇల్లాలు.

లోక్‌నాథ్ సింగ్(37) రియల్ ఎస్టేట్ వ్యాపారి. లోక్‌నాథ్ భార్య, అతడి అత్త అత్యంత దారుణంగా చంపేశారు. శనివారం చిక్కబనవారలోని నిర్జన ప్రాంతంలో ఒక పాడుబడిన కారులో లోక్‌నాథ్ సింగ్ మృతదేహాన్ని కొంతమంది వ్యక్తులు గుర్తించడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

ఇది కూడా చదవండి: Raja Saab : రాజాసాబ్ షూట్ ఇంకా పెండింగ్.. రిలీజ్ డౌటే

పోలీసుల వివరాల ప్రకారం.. లోక్‌నాథ్‌ను భార్య, అతడి అత్త చంపినట్లుగా పోలీసులు తెలిపారు. లోక్‌నాథ్ పెళ్లి కాక ముందు.. భార్యతో ముందుగా రెండేళ్లు సహజీవనం చేశాడని.. గత డిసెంబర్‌లోనే కునిగల్‌లో పెళ్లి జరిగినట్లుగా తెలిపారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు పోలీసులకు కాల్ వచ్చిందని.. మృతదేహం గురించి సమాచారం ఇచ్చారని తెలిపారు. కేసు నమోదు చేసి బాధితుడి భార్య, అత్తను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సైదుల్ అడవత్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Nicholas Pooran: నికోలస్ పూరన్ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లోనే రికార్డు

అయితే ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఉండడంతో భార్య కుటుంబ సభ్యులు పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక పెళ్లి జరిగినట్లుగా ఇరుకుటుంబ సభ్యులకు తెలియదు. అయితే లోక్‌నాథ్ పెళ్లి చేసుకోగానే.. భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. పెళ్లైనట్లుగా రెండు వారాల క్రితమే భార్య కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆ సమయంలోనే లోక్‌నాథ్ వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు గురించి తెలుసుకున్నారు. ఈ విషయంపై దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో లోక్‌నాథ్.. తన పలుకుబడి ఉపయోగించి తన అత్తమామలను బెదిరించడం మొదలు పెట్టాడు. తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించాడు. ఈ పరిస్థితులు మరింత శృతిమించడంతో లోక్‌నాథ్‌ను చంపేయాలని భార్య, అత్త పథకం రచించారు.

లోక్‌నాథ్.. భార్య ఇంటికి వచ్చినప్పుడు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. లోక్‌నాథ్ నిద్రలోకి జారుకోగానే ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి పారిపోయారని దర్యాప్తులో తేలినట్లుగా పోలీసులు తెలిపారు. లోక్‌నాథ్ వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చి చెప్పారు. ఒక మోసం కేసులో లోక్‌నాథ్ బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Crocodile In College: ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం