Site icon NTV Telugu

Wife Kills Husband: పెళ్లయిన నెలకే భర్తకు విషం పెట్టి చంపిన భార్య..

Poison

Poison

Wife Kills Husband: మేఘాలయలో రాజా రఘువంశీ అనే వ్యక్తిని భార్య సోనమ్ హత్య చేసిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి, కిరాయి హంతకులతో భార్య హత్య చేయించింది. ఈ హత్యకు సోనమ్‌, ఆమె లవర్ రాజ్ కుష్వాహాలు ప్లాన్ చేశారు. ఈ హత్య జరిగిన తర్వాత ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది.

జార్ఖండ్‌లోని గుర్హ్వా జిల్లాలో భార్య, తన భర్తకు విషమిచ్చి హత్య చేసింది. పెళ్లయిన 36 రోజులకు తన భాగస్వామిని చంపేస్తింది. 22 ఏళ్ల మహిళ తన భర్తకు విషమిచ్చి చంపినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. నిందితురాలిని సునీతగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాధితుడి తల్లి రాజ్‌మతి దేవీ తన కోడలిపై హత్యా ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: Air India crash Investigation: ఎయిర్ ఇండియా దర్యాప్తు కీలకంగా RAT..? ఇది ఏ సమయంలో బయటకు వస్తుంది..?

ఎఫ్ఐఆర్ ప్రకారం, రాంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఈ ఏడాది మే 11న ఛత్తీస్‌గఢ్ రామచంద్రపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని విషు‌న్‌పూర్ గ్రామానికి చెందిన సునీతతో వివాహమైంది. పెళ్లి జరిగిన తర్వాత రోజు నుంచే సునీత పుట్టింటికి వచ్చింది. ఆమె తనకు బుద్ధనాథ్ నచ్చలేదని, అతడితో జీవించలేదని చెప్పింది. అయితే, పెద్ద మనుషుల పంచాయతీలు నచ్చచెప్పడంతో సునీత, బుద్ధనాథ్ ఇంటికి వచ్చింది.

జూన్ 14న, ఈ జంట రామానుజ్ గంజ్ మార్కెట్‌కు వెళ్లారు. పంటలకు పురుగుల మందు అవసమరని సునీత, బుద్ధనాథ్‌లో కనిపించింది. జూన్ 15 రాత్రి, సునీత తన భర్తకు ఆహారంలో పురుగుల మందు కలిపిందనే ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు, నిద్రలోనే అతను చనిపోయి కనిపించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణాలు నిర్ధారిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version