Site icon NTV Telugu

భర్త రోజూ ఆ పని చేస్తున్నాడని మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఆ తరువాత

crime news

crime news

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. వాటిని అధిగమిస్తేనే జీవితం సాఫీగా సాగుతోంది. అలాకాదు అని భార్య విసిగిస్తుందని, భర్త వేధిస్తున్నాడని హతమారుస్తూ పోతే సమాజంలో భార్యాభర్తల బంధానికి విలువే లేకుండా పోతుంది. తాజాగా ఒక భార్య, భర్త విసిగిస్తున్నాడని అతి కిరాతకంగా హతమార్చింది. అంతేకాకుండా భర్త ప్రైవేట్ పార్ట్ ని కోసేసి మరీ హతమార్చిన దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. . సీతానగరం మండలం రఘుదేవపురం యనాదుల కాలనీలో నివాసముంటున్న ముత్యాలమ్మ, అబ్బులు భార్యాభర్తలు. గత కొన్నిరోజుల నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త రోజూ ఇంటికి తాగివచ్చి ముత్యాలమ్మను విసిగిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భర్తతో గొడవపడిన ఆమె.. ఇంటినుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే వెళ్లిన భర్త రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదు.

ముత్యాలమ్మ మాత్రం రాత్రి ఇంటికి రాగా.. ఉదయం భర్త శవం రాపాక రోడ్డులోని కల్వర్టులో దొరికిందని తెలియడంతో వెంటనే భర్త శవాన్ని తీసుకొని దహన సంస్కారాలు చేయడం మొదలుపెట్టింది. దీంతో అనుమానించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముత్యాలమ్మను విచారించగా భర్త తాగిన మత్తులో ఫిట్స్ వచ్చి మృతిచెందినట్లు చెప్పింది. దీంతో భర్త శవాన్ని చెక్ చేసిన పోలీసులకు అతని ప్రైవేట్ పార్ట్ కట్ అయినట్లు గుర్తించారు. దీంతో ముత్యాలమ్మను తమదైన రీతిలో ప్రశ్నించగా.. నిత్యం భర్త వేధింపులను తట్టుకోలేక తానే భర్తను హతమార్చినట్లు ఒప్పుకున్నది.. బయటికి తీసుకెళ్లి పక్కనే ఉన్న సిమెంట్ బేసిన్ పెంకుతో మర్మాంగాన్ని కోసి.. దాన్ని పక్కన విసిరేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ముత్యాలమ్మను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Exit mobile version