NTV Telugu Site icon

AP Crime: ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టిన భార్య.. బండారం బయటపట్టిన కూతురు..

Crime

Crime

AP Crime: వివాహేతర సంబంధానికి అడ్డుస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. అనంతరం ఏమీ తెలియనట్లు నాటకం ఆడింది. ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే నాన్నను చంపింది అమ్మే అంటూ కన్న కూతురుతే సాక్ష్యం చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుపతి జిల్లా పాడిపేట గ్రామంలో చోటు చేసుకుంది. అంతేగాక భర్త ఉరివేసుకొని మృతిచెందాడని కుటుంబసభ్యులను నమ్మించింది. అయితే కన్న తండ్రిని చంపిన కన్న తల్లి అని ధనలక్ష్మీ కూతురు చెప్పడం అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: Revanth Reddy: ముఖ్యమంత్రి ఆదేశాలతో గిరిజన అమ్మాయికి ఐఐటీకి వెళ్లేలా ప్రభుత్వం సాయం..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తీ నియోజకవర్గానికి చెందిన నరేష్ కు, అదే ఊరికి చెంది ధనలక్ష్మితో పెళ్ళి అయ్యింది.. మొదట కాపురాన్ని ముసిలిపేడులో పెట్టాడు నరేష్.. పెళ్ళి అయినా కోత్తలో సంతోషంగా.. ప్రేమగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు.. కుటుంబ పోషణ, భార్యను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో కాళహస్తీ, ముసలిపేడు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో నరేష్ ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. ఆటో నడపడం వల్ల వస్తున్న ఆదాయంతో ఉన్నంతలో ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంది. వస్తున్న ఆదాయాన్ని కోంత ఇంటికి ఖర్చులకు.. మరికొంత పిల్లల కోసం దాచుకునేవాడు.. తాను పెద్దగా చదువుకోక పోయిన పిల్లలకు మంచి భవిష్యత్తు అందిచాలనుకున్న నమేష్.. తన ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేశాడు. అలా అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి స్నేహితుడు రూపంలో ఉన్న మృత్యువు ప్రవేశించింది. ముసిలిపేడులో అదే గ్రామంలో ఉంటున్న నరేష్ చిన్ననాటి స్నేహితుడే హరితో కష్టసుఖాలు చెప్పుకుంటూ బాగానే ఉండేవారు.. హరి స్థానికంగా ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూన్నాడు. ఇద్దరు స్నేహితులు కావడం అదే ఒకే రకమైన డ్రైవింగ్ ఫీల్డ్ కావడంతో తరుచుగా కలిసేవారు. అదే సమయంలో హరిని ఓ రోజు ఇంటికి పిలిచాడు రమేష్.. ఇంటిలో ఉన్న భార్య ధనలక్ష్మీని హరి పరిచయం చేశాడు… హరి కూడా తన స్నేహితుడని భార్యకు పరిచయం చేశారు నరేష్.. తన మిత్రుడిని సొంత కుటుంబ సభ్యుడిగా భావించాడు.. కానీ, ఈ సమయంలోనే హరి తనలోని వక్రబుద్ధి బయటపెట్టాడు.. పైకి నరేష్ కుటుంబంతో బాగానే ఉంటున్న.. తన కన్ను మాత్రం నరేష్ భార్య ధనలక్ష్మీపై పడింది.

Read Also: Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌ ఘటనలో విచారణ ముమ్మరం.. రేపటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ

పెళ్లికాని హరికి ధనలక్ష్మీ మాటలు.. ప్రేమగా మాట్లాడటం నచ్చింది.. దీంతో ధనలక్ష్మీని ట్రాప్ చేయాలని భావించాడు… తనవైపున తిప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు హరి… అలా నరేష్ లేనప్పుడల్లా ఇంటికి రావడం మొదలు పెట్టాడు.. దీంతో ధనలక్ష్మీకి – హరి మధ్య సన్నిహిత్యం పెరిగింది.. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.. దీంతో ఇద్దరు నరేష్ లేనప్పుడు కలుసుకోవడం అలవాటుగా మారింది. ఇక ఇద్దరు పిల్లలను హరిని బాబాయ్ గా పిలవాలని ధనలక్ష్మీ చెప్పడంతో తల్లి చెప్పినట్లుగా హరిని బాబాయ్ అంటూ పిలవడం మొదలుపెట్టారు. పిల్లలు సైతం అడిగింది కోనిచ్చి తనదారికి తెచ్చుకుని ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం నరేష్‌కు తెలియడంతో మొదట్లో ధనలక్ష్మిని గట్టిగా మందలించాడు.. పూర్తిగా ప్రియుడు హరి మైకంలో మునిగిపోయిన ఆమె.. పట్టించుకోకపోవడంతో.. గొడవలు పెద్దల వరకు వెళ్లాయి.. భార్య ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశించి.. ముసిలిపేడు నుంచి తిరుపతి రూరల్ మండలం, పాడిపేటకు మకాం మార్చాడు నరేష్.. పక్కన ఉన్న తిరుచానూరులోనే ఆటో నడుపుతూ రాత్రి ఇంటికి వచ్చేవాడు..

Read Also: Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌ ఘటనలో విచారణ ముమ్మరం.. రేపటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ

కానీ, ధనలక్ష్మి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఎడుఅడుగుల బంధం కంటే మూడేళ్లుగా ప్రియుడుతో ఉన్న అక్రమ సంబంధమే ఎక్కవగా ఇష్టపడింది.. దీంతో తనకు అడ్డుగా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది ధనలక్ష్మీ.. వెంటనే విషయాన్ని ప్రియుడు హరి చెప్పింది. ఇద్దరు కలసి నరేష్ హత్యకు ప్లాన్ వేశారు.. ఒక వైపు హత్యకు ప్లాన్ వేస్తునే నరేష్ ఇంట్లో లేని సమయంలో హరికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. పిల్లలను మరో గదిలో ఉంచి గడియా పెట్టి రాసలీలల్లో మునిగిపోయేది. అలా జూలై 22వ రాత్రి 11 గంటలకు నరేష్ తిరుచానూరు నుంచి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. నరేష్ ఆహారం తిని నిద్రిస్తున్న సమయంలో.. హరికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించిన ధనలక్ష్మీ నిద్రపోతున్న నరేష్ పైకి ఒక్కసారిగా దాడి చేసి గొంతుపై దిండు వేసి ఊపిరాడకుండా చేశాడు ప్రియుడు హరి.. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలు నిధి శ్రీ, మనోజ్ నిద్రలేవడంతో వారు అరవకుండా నోటిలో గుడ్డలు పెట్టి గట్టిగా అదిమి పెట్టింది ధనలక్ష్మీ… ఇద్దరు చంపడాన్ని చూడకుండా కళ్ళుకు గంతలు కట్టి ప్రయత్నం చేసింది. నరేష్ తన చీరతోనే ఊరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించడానికి ప్లాన్ చేశారు.. ప్లాన్ ప్రకారమే అత్తింటివారికి ఉదయాన్నే ఫోన్ తన భర్త ఉరి వేసుకున్నాడని సమాచారం అందించింది ధనలక్ష్మి.. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడం.. అదే సమయంలో తండ్రి చావును కళ్ళారా చూసినా కుమార్తె నిధి శ్రీ రాత్రి జరిగిన హత్యను.. హరి వచ్చిన విషయాన్ని చెప్పడంతో.. ధనలక్ష్మి గుట్టు వ్యవహారం మొత్తం బయటపడింది..