వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పరాయివారిపై ఉన్న మోజుతో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా తమిళనాడులో ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చింది ఒక భార్య. సాంబార్ లో విషం కలిపి భర్తను చంపి, అనారోగ్యంతో కన్నుమూసినట్లు అందరిని నమ్మించింది. కానీ, చివరకు బంధువుల అనుమానంతో పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ (47) కి కొన్నేళ్ల క్రితం సూర్య తో వివాహమైంది. దేవేంద్రన్ కీలయూర్ యూనియన్ డీఎంకే కౌన్సిలర్ గా విధులు నిర్వహించేవాడు. ఎలాంటి కలతలు లేకుండా ఉన్న వీరి జీవితంలోకి అదే ప్రాంతానికి చెందిన ఇంజినీరు చంద్రశేఖర్ ఎంటర్ అయ్యాడు. అతనితో సూర్య వివాహేతర సమబంధం పెట్టుకొంది. భర్త ఇంట్లో లేనప్పుడు చంద్రశేఖర్ తో కామక్రీడలు కొనసాగించేది. ఇక తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సూర్య ఎలాగైనా భర్తను అడ్డుతొలగించాలనుకుంది. దీనికోసం పక్కా ప్లాన్ వేసింది. ఇటీవల దేవేంద్రన్ పచ్చకామర్లు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు.
ఇటీవల చికిత్స అనంతరం ఇంటికి చేసురుకున్న భర్తకు సాంబార్ లో విషం పెట్టి సూర్య హతమార్చింది. అనారోగ్యంతో భర్త మృతిచెందినట్లు అందరిని నమ్మించి కన్నీళ్లు కార్చింది. అయితే దేవేంద్రన్ అనారోగ్యం గురించి అందరికి తెలియడంతో వారు కూడా భార్య చెప్పిన మాటను నమ్మేశారు. కానీ. గత కొన్నితోజులుగా సూర్య ఎవరితోనో ఫోన్ లో మాట్లాడడం, కంగారు పడడం గమనించిన బంధువులు పోలీసులకు తమ అనుమానాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారణ చేయగా సూర్య బాగోతం బయటపడింది. దీంతో ఆదివారం సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
