NTV Telugu Site icon

Gurugram Accident: కారు ఢీకొని బైకిస్టు మృతి.. డ్రైవర్‌కు బెయిల్ ఇవ్వడంపై బాధిత కుటుంబం ఆగ్రహం

Gurugramaccidentdies

Gurugramaccidentdies

గురుగ్రామ్‌లో కారు-బైక్ ప్రమాదం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాంగ్ రూట్‌లో కారు రావడంతో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న బైకర్ ఢీకొని 23 ఏళ్ల అక్షత్ గార్గ్ ప్రాణాలు వదిలాడు. రాంగ్ సైడ్‌లో ఎస్‌యూవీ కారును నడిపిన వ్యక్తికి వెంటనే బెయిల్ లభించింది. దీంతో అతడికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటూ గురుగ్రామ్ ప్రమాద బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: Supreme Court YouTube Channel Hacked: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. షాకింగ్ వీడియో ప్రత్యక్షం!

23 ఏళ్ల అక్షత్ గార్గ్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్-2లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వేగంగా వెళ్తున్నాడు. అటువైపు నుంచి రాంగ్ రూట్‌లో వస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టాడు. అక్కడికక్కడే అక్షత్ చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్షత్ స్నేహితుడి బైక్‌పై అమర్చిన గోప్రో యాక్షన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎస్‌యూవీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు… వెంటనే అతడికి బెయిల్ లభించింది.

ఇది కూడా చదవండి: Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..

ఢిల్లీలోని ద్వారకలో అక్షత్ నివాసముంటున్నాడు. హెల్మెట్, గ్లౌజులు ధరించి బైక్‌పై వెళుతున్న దృశ్యం వీడియోలో కనిపించింది. వేగంగా వెళ్తూ మలుపు తీసుకుంటుండగా అకస్మాత్తుగా రాంగ్ సైడ్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఆ వేగంలో ఢీకొనడంతో అక్షత్ మృతిచెందాడు. కారు ముందు భాగంగా ధ్వంసమైంది.

ఇది కూడా చదవండి: AP CM Chandrababu: ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే..

BNS సంబంధిత సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. నిందితుడిని చట్ట ప్రకారం అరెస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులు ఆగస్ట్ 2024లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు 16,000+ చలాన్‌లు కూడా జారీ చేశారు. కఠిన చర్యలు కొనసాగుతాయని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఎస్‌యూవీ డ్రైవర్‌కు బెయిల్‌ ఇవ్వడంపై అక్షత్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘‘నా కొడుకుకు న్యాయం జరగాలి. తప్పులో ఉన్న వ్యక్తి నా కొడుకును చంపాడు. బెయిల్‌పై ఎందుకు విడుదలయ్యాడు అనేది నా ఏకైక ప్రశ్న? నా కొడుకు వెళ్లిపోయాడు కానీ అతను (నిందితుడు) ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు … పోలీసులు మాకు సహాయం చేయలేదు?’’ అని ఆమె ప్రశ్నించింది. పోలీసులు వేగంగా స్పందించి అంబులెన్స్‌లో తీసుకెళ్లినా అక్షత్‌ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఎస్‌యూవీ డ్రైవర్‌ కుల్దీప్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు.

Show comments