Dead Body in Parcel: డెడ్ బాడీ హోమ్ డెలివరీ కేసులో వీడిన మిస్టరీ.. ఇన్ని ట్విస్ట్‌లా..?
- డెడ్ బాడీ హోమ్ డెలివరీ కేసులో నిందితుడి అరెస్ట్..
- వీడిన సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Body in Parcel: పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళకు ఈనెల 19వ తేదీన ఇంటి నిర్మాణ సామాగ్రి పేరుతో అందిన పార్సెల్ లో వచ్చిన డెడ్ బాడీ కలకలం రేపింది. ఇంటి నిర్మాణ సామాగ్రి పేరుతో ఓ ఆటో డ్రైవర్ పార్సిల్ తీసుకొని అందించాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం ఆచూకీ గుర్తించేందుకు పోలీసులకు నాలుగు రోజుల సమయం పట్టింది. కాళ్ల మండలం గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న సిద్ధార్థ వర్మ అలియాస్ సుధీర్ వర్మపై పోలీసులు మొదటినుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్సిల్ సాగి తులసి ఇంటికి వచ్చిన నాటి నుంచి సుధీర్ వర్మ అతని మొదటి భార్య పరారీలో ఉండడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఐదు రోజుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డెడ్ బాడీ పార్సెల్ అందుకున్న సాగి తులసి చెల్లెలు రేవతిని సిద్ధార్థ వర్మ రెండవ వివాహం చేసుకున్నాడు. సాగి తులసి భర్తకు దూరంగా ఉండడంతో ఆమెకు దక్కే ఆస్తిలో భాగమైన పొలాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధార్థ వర్మ పార్సిల్‌లో మృతదేహాన్ని పంపి ఆమెను భయపెట్టేందుకు ప్రయత్నించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
Read Also: YS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
వదిన ఆస్తిని కాజేసేందుకు వేసిన ప్లాన్ లో భాగంగా కాళ్ల మండలం గాంధీనగరం కు చెందిన బర్రె పర్లయ్య ను నిందితుడు సిద్ధార్థ వర్మ హత్య చేసి మృతదేహాన్ని బాక్సులో పెట్టి ఎండగంటిలోని అతని వదినకు పంపించాడు. విషయం బయటికి పొక్కడంతో కలకలం రేగింది. దీంతో తాను నివాసముండే గాంధీనగరం నుంచి నిందితుడు రెడ్ కలర్ కారులో కుటుంబంతో సహా పరారయ్యాడు. మృతదేహం ఆచూకీ లభించడంతో సుధీర్ వర్మ నిందితుడు అనడానికి బలమైన ఆధారాలు పోలీసులకు లభించాయి. మూడు రోజులు పని నిమిత్తం పర్లయ్యను ఇంటికి పిలిపించుకున్న వర్మ అతనిని ఎందుకు హత్య చేశాడు..? మృతదేహాన్ని అతని వదిన ఇంటికి ఎందుకు పంపించాడు అనే విషయాలపై పూర్తి ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈనెల 16, 17 తేదీల్లో పర్లయ్యను పనికి తీసుకువెళ్లిన సుధీర్ వర్మ 19వ తేదీ సాయంత్రం హడావిడిగా తన ఇంటి నుంచి కుటుంబంతో సహా కారులో పోతున్న విజువల్స్ ఎన్టీవీ చేతికి చిక్కాయి. సుధీర్ వర్మ ఇంటి వద్ద పర్లయ్య పనిచేస్తున్న విజువల్స్ సైతం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పార్సెల్ వచ్చిన డెడ్ బాడీ మిస్టరీ కొంతవరకు వీడింది. ఇదే సమయంలో సుధీర్ వర్మ ఇంటి నుంచి మరొక చెక్క పెట్టను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే సుధీర్ వర్మ 2 హత్యలు చేయడానికి ప్లాన్ చేశాడా, అసలు మృతదేహాన్ని వదిలి ఇంటికి పంపి ఏం చేయాలనుకున్నాడు, అనే విషయాల్లో క్లారిటీ రావాలి.
Read Also: Manchu Manoj: మంచు మనోజ్ ఫిర్యాదు కాపీలో సంచలన అంశాలు
డెడ్ బాడీ పార్సెల్ కేసులో నిందితుడి క్రైమ్ మెంటాలిటీ చూసి పోలీసులు సైతం నూరేళ్ల పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. డెడ్ బాడీ పార్సెల్ విషయంలో పోలీసుల కళ్లుగప్పి తిరిగిన నిందితుడు సిద్ధార్థ వర్మ.. 19వ తేదీ గురువారం ఇంటి నుంచి కుటుంబంతో సహా పరారయ్యాడు. అంతకు ముందు రెండు రోజులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్థానికులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఇంటి నుంచి పారిపోక ముందే పర్లయ్యను హత్య చేసి జామర్ల ద్వారా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలోనే మృతదేహం ఉన్న బాక్స్ ను కారులో ఉంచి ఇంటి నుంచి బయటకు వచ్చాక ఆటో డ్రైవర్ ద్వారా మృతదేహాన్ని తన వదిన ఇంటికి హోమ్ డెలివరీ చేయించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ బాక్స్ లో వచ్చిన డెడ్ బాడీ పర్లయ్యదని నిర్ధారణ అయింది. పర్లయ్యను తన మొదటి భార్య రాణి ఇంటిలో హత్య చేసిన నిందితుడు సుధీర్ వర్మ కేవలం ఆస్తి కోసమే మృతదేహాన్ని తన రెండో భార్య ఇంటిలో ఉంచి ఆమెను బెదిరింపులకు గురిచేసి ఆమె పేరుపై ఉన్న పొలాన్ని తన పేరుపై రాయించుకోవాలని ప్రయత్నాలు చేశాడా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో ఇంకెలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!