Site icon NTV Telugu

Playing Cards : ‘కిట్టి పార్టీ’ పేరుతో పేకాట.. భర్త టాస్క్ తో టాస్క్ ఫోర్స్ ఎంట్రీ..!

Playing Cards

Playing Cards

Playing Cards : సాధారణంగా మహిళలకు సీరియల్స్ చూడడం ఇష్టం ఉంటుంది. చీరలు, గాజులు, నగలు పెట్టుకోవడంపైన మోజు ఉంటుంది. సీరియల్స్ విషయంలో కొంత మంది మహిళలు పిచ్చిగా ఉంటూ ఉంటారు. అంతే కాదు సీరియల్స్‌ను వ్యసనంగా మార్చుకుంటారంటే కూడా అతిశయోక్తి లేదు. అలాంటి మహిళలు కొంత మంది ఇప్పుడు పేకాటకు కూడా బానిస అవుతున్నారు. భర్తను పట్టించుకోకుండా పేకాట ఆడుతున్నారు. ఇలాంటి ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా ఈ పాట పురుషులు పేకాడుతున్నప్పుడు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ పాట మార్చాల్సిందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పురుషులతో సమానంగా మహిళలు సైతం పేకాట ఆడుతున్నారు. విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో ఆరుగురు మహిళలు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు.. యస్ మీరు విన్నది కరెక్టే. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసులకు ఒక వింత కేసు ఎదురయింది. తన భార్య రోజు కొంతమంది మహిళలతో కలిసి పేకాట ఆడుతూ ఓవైపు సమయాన్ని మరోవైపు ధనాన్ని అతిగా వృధా చేస్తుందని.. కనీసం తనకి తిండి పెట్టే ఉద్దేశం కూడా లేకుండా ఎప్పుడూ పేకాట ఆడడానికి వెళ్లిపోతోందని పోలీసులను ఆశ్రయించాడు ఓ భర్త. అయితే ఈ కేసును పెద్దగా నాలుగో పట్టణ పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు.

WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్

దీంతో అతను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని ఆశ్రయించాడు. ఫలితంగా..బాధితుని వద్ద మరింత సమాచారం తెలుసుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులకు కేసును అప్పగించారు.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. విశాఖలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లలిత నగర్‌లో ఓ ప్రాంతంలో దాడి చేశారు. ఆరుగురు మహిళలు పేకాట ఆడుతుండగా నాలుగవ పట్టణ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటివరకు శివారు ప్రాంతాలలో లేదా క్లబ్బులలో పబ్బులలో జూదం ఆడుతూ పోలీసులు దొరికిన యువకులను చూసి ఉంటాం.. కానీ మహిళలు పేకాట ఆడుతూ పట్టుబడడం చర్చనీయాంశమైంది. అంతే కాదు సొంత భర్తే.. భార్యపై ఫిర్యాదు ఇవ్వడం.. ఆపై దగ్గరుండి పోలీసులతో దాడులు చేయించడం..కూడా అరుదుగానే జరిగిందనే చర్చ జరుగుతోంది… కనీసం భర్తలకు తిండి కూడా పెట్టకుండా.. వంట కూడా చేయకుండా.. ఈ విధంగా పేకాటకు బానిసైన మహిళా మణులు ఎంతోమంది ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో కొన్ని కిట్టి పార్టీల పేరిట ఈ కల్చర్ రోజురోజుకీ పెరిగిపోతుందని భార్యా బాధితులు చెబుతున్నారు.

Raksha Bandhan: అడవి వీడి అన్న చెంతకు.. 40 ఏళ్ల తర్వాత రాఖీ కట్టిన చెల్లి..

Exit mobile version