Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రౌడీషీటర్ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ సెల్ఫీ వీడియోలో, రౌడీషీటర్ క్రాంతి కుమార్ తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణమని ఆరోపించినట్లు తెలుస్తోంది. మే 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం, క్రాంతి కుమార్ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోరిపోగు వెంకటేశ్వరరావు కుమారుడు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసినట్లు చెబుతున్న సెల్ఫీ వీడియోలో, పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. వీడియోలో చేసిన ఆరోపణలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై వివిధ కోణాల్లో పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో వివాదం కూడా కొనసాగుతోంది. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమారుడిని పోలీసులు తీసుకెళ్లి లాకప్ డెత్‌కు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు.
Also Read
- Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
- Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
అదే సమయంలో, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు విడుదల చేసినట్లు చెబుతున్న వీడియో వెలుగులోకి రావడంతో కృష్ణలంక పోలీసుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. గాదె సాయికృష్ణ మరణం కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ స్టేటస్‌లలో “We Stand For You” అంటూ మద్దతు సందేశాలు పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణలంకలో చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలు విజయవాడలో తీవ్ర చర్చకు దారితీయగా, దర్యాప్తు ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది.
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..