NTV Telugu Site icon

Uttar Pradesh: 14 ఏళ్ల బాలికపై మతగురువు అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి అఘాయిత్యం..

Minor Girl Abuse

Minor Girl Abuse

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కొన్ని రోజులుగా ఓ మతగురువు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో కాన్పూర్‌లో మతగురువుని అరెస్ట్ చేశారు. నిందితుడు సోనూ హఫీజ్ గత కొన్ని రోజులుగా 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్నాడు, ఈ క్రమంలోని బాలిక గర్భం దాల్చడంతో, తొలగించేందుకు అబార్షన్ మాత్రలు కూడా ఇచ్చాడు. హఫీజ్‌పై పోక్సో, ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.

Read Also: World War-3: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న వరల్డ్ వార్-3

మూడు నెలల గర్భంతో ఉన్న బాలికకు అబార్షన్ మాత్రలు ఇవ్వడంతో, ఆమె ఆరోగ్యం విషమించింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. బాలికను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు, బాలిక 3 నెలల గర్భిణిగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. కాన్పూర్‌లోని ఔట్‌పోస్ట్‌లో ఉన్న మసీదు సమీపంలో మత గురువు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాన్పూర్ పోలీసులు మతపెద్దపై కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. నిందితుడు హఫీజ్ ఖరీదైన ఆహార పదార్థాలు, పానీయాలతో తనను ఆకర్షించేవాడని చెప్పింది. ముందుగా హఫీజ్ అంటే భయపడిన కుటుంబ సభ్యులు, ముందుగా ఈ వేధింపులపై ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show comments