Gold Smuggling: స్మగ్లింగ్‌లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో ఒక పెద్ద బంగారు స్మగ్లింగ్ కలకలం రేపింది. అమెరికా నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ పౌరుడు రూ. 5.5 కోట్ల విలువైన 115 బంగారు బిస్కెట్లను తన ప్యాంటులో దాచుకుని నడుస్తూ పట్టుబడ్డాడు.
ఆ వ్యక్తి శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. కొంతమంది అంతర్జాతీయ స్మగ్లర్లు భారీగా బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందింది. ఈ సమాచారంతో అధికారులు విమానాశ్రయంలో నిఘాను తీవ్రం చేశారు.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
సదరు ప్రయాణికుడు విమానం దిగగానే, కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు అతని కదలికలను నిశితంగా గమనించారు. ఆ వ్యక్తి ఎటువంటి తనిఖీలు లేకుండా విమానాశ్రయం నుంచి బయటపడటానికి ప్రయత్నించాడు. కానీ, అతని ప్రవర్తన, నడకపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని అడ్డుకుని ప్రశ్నించారు.
సాక్షుల సమక్షంలో అతడు ధరించిన ప్యాంటును.. అతని సామాగ్రిని పూర్తిగా తనిఖీ చేయగా.. దాదాపు 3.5 కిలోల బరువున్న 115 బంగారు బిస్కెట్లు దొరికాయి. 24 క్యారెట్ల ఈ బంగారాన్ని అతను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న బెల్ట్, ప్యాంటు లోపలి జేబుల్లో ఎవరికీ అనుమానం రాకుండా దాచాడు.
అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ ముఠా ఉందా అనే కోణంలో అతని ఫోన్, ప్రయాణ వివరాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అతను కేవలం ఒక బంగారాన్ని చేరవేసే వ్యక్తి(క్యారియర్) మాత్రమేనని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారంపై దిగుమతి సుంకం పెరగడం వల్లే ఇలాంటి స్మగ్లింగ్ కేసులు ఎక్కువవుతున్నాయని, అందుకే విమానాశ్రయాల్లో సరికొత్త సాంకేతికతతో తనిఖీలను మరింత కఠినతరం చేశామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!