UPI Safety Tips: మీరు యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?
- యూపీఐ ద్వారా నగదు బదిలే చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
- సైబర్ నేరగాళ్లు క్షణాల్లోనే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం
- హెచ్చరిస్తున్న టెక్ నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు యూపీఐ (UPI) ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నారా? అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. యూపీఐను ఉపయోగించే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని సైబర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఒక చిన్న పొరపాటు కూడా భారీ నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు క్షణాల్లోనే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉందని.. అందుకే యూపీఐ మోసాలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల పెరుగుదలతో పాటు మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల నుండి లక్షల రూపాయలు దొంగిలిస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవాలంటే మీ యూపీఐ ఖాతాను ప్రధాన పొదుపు ఖాతా నుండి వేరు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంటే యూపీఐకు లింక్ చేసిన ఖాతాలో పరిమిత మొత్తమే ఉంచాలి. అలాగే అనేక బ్యాంకులు యాప్‌లో ట్రాన్సాక్షన్ లిమిట్లను సెట్ చేసుకునే అవకాశం ఇస్తాయి. ఇవి సెట్ చేస్తే మోసం జరిగినా నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
యూపీఐలో డబ్బు పంపే ముందు రిసీవర్ పేరును రెండుసార్లు తనిఖీ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. QR కోడ్ స్కాన్ చేసినప్పుడు స్క్రీన్‌పై కనిపించే సందేశాన్ని పూర్తిగా చదవండి. సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ “తక్షణంగా చెల్లించండి” అనే ఒత్తిడి కలిగించే సందేశాలు పంపుతారు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ముందుగా ఆ అభ్యర్థనను పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్‌ను దుకాణాలు, కేఫ్‌లు వంటి ప్రదేశాలకు రిపేర్ చేయడానికి ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి పిన్ లీక్ అయిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లోనే ఖాళీ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిన్‌ను ఎంటర్ చేసే సమయంలో చుట్టూ ఎవరైనా ఉండటాన్ని గమనించండి. అలాగే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం తగ్గించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!