NTV Telugu Site icon

Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..

Up

Up

Physical relations: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఓ మహిళ, తన అత్తగారిపై సంచలన ఆరోపణలు చేసింది. అత్తగారు బలవంతంగా శారీరక సంబంధం పెటుకోవడంతో సహా హింస, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాధిత మహిలకు 2022లో జీపూర్ జిల్లాలో అలోక్ ఉపాధ్యాయ్‌ను వివాహం జరిగింది. వివాహం తర్వాత నుంచి వేధింపులు ప్రారంభమైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Afghanistan: ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర.. ఏం చేసిందంటే..

అత్తగారు శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది. మహిళ నిరాకరించడంతో, బ్లేడుతో అత్త దాడి చేసింది. దీంతో ఆమె చేతిపై ఐదు గాయాలు కావడంతో కుట్లు వేయాల్సి వచ్చిందని చెప్పింది. ఆడపడుచు తన బట్టలను లాక్కుని, ఒక రూంలో బంధించి నెల పాటు ఒకే డ్రెస్సుపై ఉంచారని ఆరోపించింది. దీనికి తోడు వరకట్నం, శారీరక వేధింపులు నిరంతరం జరిగేవని చెప్పింది.

2023లో తనకు మగబిడ్డ పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువైనట్లు చెప్పింది. పిల్లల చట్టబద్ధతను ప్రశ్నించిన భర్త, ఆమెను శారీరకంగా వేధించాడు. కొట్టడంతో పాటు బాధిత మహిళను ఇంటిలోనుంచి గెంటేశాడు. ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకోవడంతో ఆమెను తిరిగి ఇంట్లోకి అనుమతించారు. ఈ గొడవల నేపథ్యంలో కొద్ధి రోజుల క్రితం మహిళ తండ్రి ఆమెను ఆగ్రాలోని పుట్టింటికి తీసుకెళ్లాడు. అయితే, ఈ నెల ప్రారంభంలో మహిళ అత్తామామలు రాజీ కోరుతూ ఆమెను తిరిగి తమ ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత మళ్లీ మహిళపై వేధింపులు ప్రారంభయ్యాయి. జూన్ 7న గొడవ జరిగింది. దీంతో విసుగుచెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.