NTV Telugu Site icon

Shocking Incident: భార్య, కుమార్తె, ఇద్దరు కుమారుల హత్య.. భర్త ఆత్మహత్య..

Up

Up

Shocking Incident: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో దారుణం జరిగింది. 45 ఏళ్ల మహిళ, 25,17,15 ఏళ్ల వయసు ఉన్న ఆమె ముగ్గురు పిల్లలు కాల్చి చంపబడ్డారు. భర్త కనిపించకుండా పోవడంతో ఈ హత్యలో అతడి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో, ఒక నిర్మాణ స్థలంలో అతను కూడా మరణించి కనిపించాడు. అతడికి కూడా బుల్లెట్ గాయమైంది. నలుగురిని తుపాకీతో కాల్చి చంపి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వారణాసిలోని భదాయిని ప్రాంతంలో రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. రాజేంద్ర గుప్తా నివాసం ఉంటున్న ప్రాంతంలో అతడికి చెందిన ఇంట్లోనే 20 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అయితే, ఇరుగుపొరుగు వారు రాజేంద్ర గుప్తా ఇళ్లు ఉదయం వరకు మూసేసి ఉండటంతో అనుమానించి చూడగా.. అతని భార్య తీరూన (45), నవనీంద్ర (25), గౌరాంగి (16), శుభేంద్ర గుప్తా (15) మృతదేహాలను గుర్తించారు. రాజేంద్ర కనిపించకండా పోయాడు. కొన్ని గంటల తర్వాత అతను కూడా చనిపోయి కనిపించాడు. కుటుంబాన్ని హత్య చేసి, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Read Also: Gas Cylinder Blast: అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి బూడిదైన 6 గుడిసెలు

కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. రాజేంద్ర గుప్తా గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. శరీరాలు ఉన్న స్థితిని చూస్తే, వారు నిద్రలో ఉన్న సమయంలోనే కాల్చి చంపినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆస్తి తగాదాలు నేరానికి దారి తీసి ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర గుప్తాకు చాలా ఆస్తులు ఉన్నాయి. 8-10 ఇళ్ల ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల అద్దెల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

రాజేంద్ర గుప్తా గతంలో పలు హత్య కేసులను ఎదుర్కొని బెయిల్‌పై బయటకు వచ్చారని పోలీసులు తెలిపారు. అతని తండ్రి, సోదరుడు, సోదరిని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం హత్యకు గురైన నీతూ గుప్తా ఆయనకు రెండో భార్య. వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని తెలిసింది. గుప్తా ఒక ఏడాది పాటు వేరే చోట ఉండీ, దీపావళికి ఇంటికి వచ్చారని తెలిసింది.

Show comments